వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

Header Banner

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

  Sun Nov 24, 2024 18:22        Politics

చిన్న పిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన వైకాపా అధినేత జగన్ రెడ్డి సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్  మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.6,500 కోట్ల బోధనా ఫీజులబకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం చేతగానితనంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. 'నాడు-నేడు' అంటూ పీక్ పబ్లిసిటీ చేసుకున్న జగన్ అండ్ కో పాఠశాలల్లో బల్లలు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలూ కల్పించలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. సంస్కరణలతో మన విద్యా వ్యవస్థను దేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #education #students #psychojagan #fruad #scams #todaynews #flashnews #latestupdate