సింగపూర్‌లో భారతీయుడికి భారీ జరిమానా! ఓ స్టోర్‌ గేటు ముందు ఆ పని చేసినందుకట?

Header Banner

సింగపూర్‌లో భారతీయుడికి భారీ జరిమానా! ఓ స్టోర్‌ గేటు ముందు ఆ పని చేసినందుకట?

  Fri Sep 20, 2024 20:08        Singapore

సింగపూర్‌లో ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తాను ఆ తప్పు చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి రూ.25 వేల ఫైన్‌ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌లో గత ఏడాది అక్టోబర్ 30న రాత్రి రాము అనే భారత పౌరుడు పూటుగా మద్యం సేవించాడు. ఆ రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు.

 

ఇంకా చదవండిఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు! 

 

తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు. దాంతో ఈ ఘటనపై విచారణ జరిపిన సింగపూర్‌ కోర్టు నిందితుడికి భారీ జరిమానా విధించింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

రాము బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేశాడని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. తన పని ముగించుకున్నాక అక్కడి నుంచి క్రాంజీలోని తన నివాసానికి వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చిన అతడు మళ్లీ జూన్ 4న వెళ్లాడు. మరోసారి అతడు కెసీనోలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది గుర్తుపట్టారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

ఈ ఘటనపై విచారణ సందర్భంగా.. నిందితుడికి గరిష్ఠ జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అతడు దాదాపు 10 నిమిషాల పాటు బయటే ఉన్నాడని, ఇది సాధారణ విషయం కాదని అన్నాడు. నిందితుడు మాత్రం తాను మద్యం మత్తులో తప్పు చేశానని, స్వల్ప జరిమానా విధించాలని కోరాడు. దీనిపై న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ‘ఇలాంటి తప్పు పునరావృతమైతే జరిమానా మరింత ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’ అని నిందితుడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants