పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌! భారత్‌ గౌరవ్‌ రైలులో తొమ్మిదిరోజుల కార్తీకమాసం స్పెషల్‌ దివ్యదక్షిణ యాత్ర!

Header Banner

పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌! భారత్‌ గౌరవ్‌ రైలులో తొమ్మిదిరోజుల కార్తీకమాసం స్పెషల్‌ దివ్యదక్షిణ యాత్ర!

  Fri Sep 20, 2024 21:39        Travel

ఈ ఏడాది అక్టోబర్‌ 23వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుటున్న వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. దివ్యదక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లంగ యాత్ర పేరుతో స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో ప్రయాణం నవంబర్‌ 6న ప్రారంభం కానున్నది. టూర్‌ ప్యాకేజీలో తొమ్మిదిరోజులు, ఎనిమిది రాత్రుల పాటు పర్యటన కొనసాగుతున్నది.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

ప్యాకేజీలో తిరువన్నామలైలోని అరుణాచలం, రామేశ్వరంలోని రామేశ్వరస్వామి, మధురైలో మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారిలో రాక్‌ మెమోరియల్‌, కుమారి అమ్మన్‌ ఆలయం, త్రివేండ్రంలో అనంతపద్మనాభ స్వామి ఆలయం, తిరుచ్చిలో రంగనాథస్వామి, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఈ టూర్‌ ప్యాకేజీలో పర్యటన హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌ జంక్షన్‌, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగులో, కావలి, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలోనూ రైలు ఆగుతుంది. ఇక పర్యటన భారత్‌ గౌరవ్‌ టూరిజం రైలులో కొనసాగుతుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

కార్తీక మాసం ప్రత్యేక దివ్య దక్షిణ్‌ యాత్ర తొలిరోజు నవంబర్‌ 6న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మొదలువుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు పర్యాణికులు భారత్‌ గౌరవ్‌ రైలులో మొదలవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు బోనగిరికి చేరుతుంది. రోజురోజు వేకువ జామున 1.20గంటలకు కావలి రైల్వేస్టేషన్‌కు రైలు వెళ్తుంది. ఉదయం 7.30 గంటలకు తిరువన్నామలై చేరుతుంది. ఆ తర్వాత హోటల్‌కు చేరుకొని దర్శనాలు పూర్తి చేసుకుంటారు. రాత్రి 10గంటలకు స్టేషన్‌కు చేరుకొని రామేశ్వరానికి ప్రయాణమవుతారు. మూడోరోజు ఉదయం 6.30 గంటలకు కుడాల్‌నగర్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. రామేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలకు వీక్షించేందుకు వెళ్తారు. రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది. నాలుగో బస్సు ద్వారా మధురైకి బయలుదేరుతారు.

 

ఇంకా చదవండిఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు! 

 

అక్కడ మీనాక్షి అమ్మవారి ఆలయంలో దర్శనాలు చేసుకుంటారు. సాయంత్రం వరకు షాపింగ్‌ చేసుకోవచ్చు. రాత్రి 11.30గంటలకు కన్యాకుమారికి వెళ్లేందుకు కుడాల్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్తారు. ఐదోరోజు కన్యాకుమారి చేరుకొని హోటల్‌కు వెళ్తారు. ఆ తర్వాత రాక్‌ మెమోరియల్‌, గాంధీ మండపం, సన్‌సెట్‌ పాయింట్‌ని సందర్శిస్తారు. రాత్రికి కన్యాకుమారిలోనే బస ఉంటుంది. ఆరో రోజు కన్యాకుమారి నుంచి కొచ్వెల్లి చేరుకొని త్రివేండ్రం చేరుకొని అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత కొచ్వెల్లికి చేరుకొని తిరుచిరాపల్లికి వెళ్తారు. ఏడో రోజు శ్రీరంగం చేరుకొని ఆలయానికి వెళ్తారు. లంచ్‌ చేసుకొని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరుకి వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ఎనిమిదో రోజు ఉదయం 8 గంటలకు రేణికుంట చేరుతారు. తొమ్మిదో రోజు వేకువ జామున 2.30గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama