రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ కీలక ప్రాజెక్టులు! కాకినాడ, అనకాపల్లిలో మెగా ఆరంభాలు!
Wed Oct 30, 2024 10:15 Politicsరాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ ప్రారంభోత్సవాలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన లిఫియస్ ఫార్మా పరిశ్రమను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మా పరిశ్రమ ద్వారా రెండు వేలమందికి ప్రత్యక్షంగా, మరికొంతమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఢిల్లీలోని ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో రిమోట్ నొక్కి ఈ పరిశ్రమను ప్రారంభించారు. ఇక్కడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ 135 ఎకరాల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 15 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ఇక్కడ యాంటీ బయాటిక్ పెన్సిలిన్ మందును ఉత్పత్తి చేస్తారని తెలిపారు.
ఇంకా చదవండి: షాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు!
ఈ పరిశ్రమ ద్వారా ఏడాదికి రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన మొక్కజొన్న ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫార్మా సంస్థ ప్రతినిధులు సంజయ్ చతుర్వేది, యుగంధర్, శరత్‌చంద్రారెడ్డి, నిత్యానంద రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, హిమాన్షురాయ్, సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రూ.62 కోట్లతో 30 పడకల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆసుపత్రి నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఎస్ఐ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చన్నారు. కార్మికశాఖ సేవలను ఆన్లైన్ ద్వారా అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 14 లక్షల మందికి నెలకు రూ. 450 కోట్లు చెల్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్ కృష్ణన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!
లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!
బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!
చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!
ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!
రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్! ప్రస్తుతం తనకు మరో వ్యక్తి!
కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!
సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్‌గా ఉంది అంటూ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #modi #pharma #company #jobs #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.