శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు! మహారాష్ట్ర రచయిత కోణంలో కొత్త ట్విస్ట్!

Header Banner

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు! మహారాష్ట్ర రచయిత కోణంలో కొత్త ట్విస్ట్!

  Wed Oct 30, 2024 11:14        Others

శంషాబాద్ ఎయిర్పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. దేశంలోని వివిధ విమానయాన సంస్థలు నడుపుతున్న 100కుపైగా విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో 16 రోజుల వ్యవధిలో 510కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బెదిరింపులు వచ్చినట్లైంది. మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ కుట్ర వెనకాల ఓ పుస్తక రచయిత ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి గోండియాకు చెందిన జగదీశ్ ఉయికే అని నాగ్పుర్ పోలీసులు తెలిపారు. గతంలో ఉగ్రవాదంపై పుస్తకం రచించిన ఈ వ్యక్తి 2021లో ఓ కేసులో అరెస్టయినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు విమానయాన సంస్థలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపించాడని, దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #samshabad #airport #aeroplane #bomb #warnings #doubtful #todaynews #flashnews #latestupdate