మీరు వాషింగ్ మెషిన్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Header Banner

మీరు వాషింగ్ మెషిన్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

  Sat Nov 09, 2024 14:38        Life Style

నేడు వాషింగ్ మెషిన్ లగ్జరీ వస్తువుగా కాకుండా ప్రతీ ఇంట్లో కనిపించే కామన్ ఐటమ్గాగా మారింది. ఈ రోజుల్లో చాలామంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషన్లపై ఆధారపడుతున్నారు. ఇంట్లో, ఆఫీస్లో కష్టపడి పనిచేసే వారికి బట్టలు ఉతకడం ఒక సవాలుగా మారింది. వాషింగ్ మిషన్ వల్ల దుస్తులు ఉతకడం కొన్ని నిమిషాలలో అయిపోతుంది. దీంతో, చాలామంది వాషింగ్ మెషీన్లపై ఆధారపడుతున్నారు. దీనిని ఉపయోగించడం సులభం కాబట్టి, అది వాడేటప్పుడు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ చిన్న పొరపాట్ల కారణంగా మెషిన్ త్వరగా పాడైపోతుంది. దీనిని వాడేటప్పుడు చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఓవర్లోడ్: చాలామంది వారంలో ఉన్న బట్టలన్నింటినీ ఒకేసారి ఉతకడం చేస్తుంటారు. అన్నీ దుస్తులను అలా ఒకేసారి మెషిన్లో వేస్తే, ఓవరలోడ్ అవుతుంది. దీని వల్ల యంత్రంపై ఒత్తిడి పడుతుంది. ఈ చిన్న పొరపాటు మిషిన్ని పాడుచేస్తుంది. ప్రతీ మిషిన్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడూ కూడా దానిని దృష్టిలో పెట్టుకుని బట్టలను అందులో వేయాలి. ఒకేసారి ఎక్కువ బట్టలు అందులో వేయడం వల్ల మెషిన్పై భారం ఎక్కువగా పడి, బట్టలను సరిగ్గా వాష్ చేయలేవు. దానిని గట్టిగా తిప్పాల్సి ఉంటుంది. దీని వల్ల అందులోని మోటార్ పాడైపోతుంది. ఎక్కువ బట్టలు ఉన్నట్లైతే రెండు లేదా మూడు సార్లు వేసుకోండి. ఇలా చేయడం వల్ల మెషిన్ పాడవ్వదు. ఒకవేళ వీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ను ఉపయోగిస్తున్నట్లైతే.. అది త్వరగా పాడైపోతుంది. అంతేకాకుండా ఎక్కువగా బట్టలు అందులో వేస్తే డోర్ రబ్బరులో బట్టలు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సమాన ఉపరితలం: మెషిన్ని ఎప్పుడూ కూడా సమాస ఉపరితలంపై ఉంచడం మంచిది. చాలామంది వాలుగా ఉండే ఉపరితలంపై ఉంచుతారు. అలా ఎగుడుదిగుడుగా యంత్రాన్ని ఉంచి వాడడం వల్ల దానిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కొంతమంది మెషిన్లో వేసిన బట్టలు ఉతకడం అయినా.. వాటిని బయటకు తీయకుండా ఉంటారు. అలా చేయడం వల్ల మెషిన్ డ్యామెజ్ అవుతుంది. మరికొందరు ప్యాంట్లలో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయకుండా వేస్తుంటారు. అలా చేయడం వల్ల చిన్న పిన్లు కానీ నాణాలు వంటివి మెషిన్లోని అంతర్గత భాగాల్లో పడి వాటిని దెబ్బతీస్తుంది. అందువల్ల బట్టలు వేసేముందు జేబులు చెక్ చేసి వేయాలి. వాస్తవానికి కొన్ని మెషిన్లు కొంతవరకే నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వాటిల్లో డిటర్జెంట్ ఎక్కువగా వేస్తే, నీటిలో కరగదు. యంత్రంలోనే గడ్డకడుతుంది. ప్రతీసారి ఇలా జరగడం వల్ల మోటార్ ఆగిపోతుంది. లింట్ ఫిల్టర్ని, నీరు వెళ్లే ఇన్లెట్ దగ్గర ఉండే వాటర్ ఫిల్టర్ని వారానికి ఒకసారైనా క్లీన్ చేయండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా... 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #WashingMachine