తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు! గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సర్వే ఆధారంగా ప్రణాళికలు!

Header Banner

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు! గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సర్వే ఆధారంగా ప్రణాళికలు!

  Tue Nov 12, 2024 20:11        Gulf News

◉ గల్ఫ్ కార్మికులందరిదీ ఒకే కులం... ఒకే వర్గం !

◉ సంఖ్యా బలం నిరూపణకు సర్వే ఒక అవకాశం 

◉ గల్ఫ్ కుటుంబాలు నిర్భయంగా వివరాలు వెల్లడించాలి  

సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొనాలని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ మంగళవారం గాంధీభవన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలకు వెళ్లారని చెబితే... రేషన్ కార్డు తీసేస్తారని, రైతు బంధు కట్ చేస్తారని, ఇతర సంక్షేమ పథకాలు వర్తించవని బీఆర్ఎస్, బీజేపీ లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికులందరిదీ ఒకే కులం... ఒకే వర్గం అని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు, సమస్యలు విన్నవించుకోవడానికి 'ప్రవాసీ ప్రజావాణి' ఏర్పాటు జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సర్వేలో సేకరించిన సమాచారం ఎంతో కీలకం అవుతుందని వినోద్ అన్నారు. 

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

సర్వే ద్వారా గల్ఫ్ కార్మికుల సంఖ్యాబలం తేలితే... వారి సంక్షేమానికి, సురక్షిత వలసలకు సరైన ప్రణాళికలు వేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న నిర్వహించిన 'సమగ్ర కుటుంబ సర్వే' లో సేకరించిన గల్ఫ్ కార్మికుల సమాచారాన్ని అప్పటి సీఎం కేసీఆర్ బయటపెట్టలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వలేదని భీంరెడ్డి విమర్శించారు. 

 

సరిహద్దుల్లోని సైనికుల లాగా గల్ఫ్ కార్మికులు దేశానికి ఆర్థిక జవాన్లు. వీరు పంపే విదేశీ మారకద్రవ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నది. గల్ఫ్ కార్మి 'కులం' అని చెప్పుకోవడానికి గర్వపడాలని గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు అన్నారు. విదేశాల్లో నివసిస్తున్నవారి వయస్సు, విద్యార్హత, వృత్తి, ఉద్యోగం లాంటి వివరాలతో పాటు గ్రామం, మండలం, జిల్లాల వారీగా డేటా లభ్యమవుతుంది. వాపస్ వచ్చినవారు గ్రామాలలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ పథకాల రూపకల్పనకు ఈ సమాచారం ఎంతో కీలకం అని శ్రీనివాస రావు అన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants