సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త!

Header Banner

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త!

  Tue Nov 12, 2024 18:42        Life Style

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఉపయోగాలతో పాటుగా నష్టాలు కూడా ఉన్నాయి. చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా యాప్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులో వారి జీవితంలో జరిగిన ప్రతీ మూమెంట్ను షేర్ చేసుకుంటారు. ఆనందాన్ని, బాధను పంచుకుంటుంటారు. ఇప్పుడు పదేళ్ల వయసు నుంచి పండు ముసలి వారు వరకు సోషల్ మీగడియాను యూజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే, సోషల్ మీడియా యూజర్ల విషయంలో మానసిక నిపుణులు కీలక విషయాలు తెలియజేస్తున్నారు. దీని వల్ల మనిషి మానసికంగా, శారీరకంగా ఎఫెక్ట్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు.

 

ఈ క్రమంలోనే.. జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, రూర్ వర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో.. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మంచిదని, లేకపోతే మానసిక సమస్యలు పెరుగుతాయని తెలిపింది. రోజులో కనీసం గంట పాటు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకుంటే మంచిదని, దీని వల్ల చేసే పనిపై ఏకాగ్రత పెరగడంతో పాటుగా పనిలో సంతృప్తి కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియా, ఎక్కువగా ఉపయోగించే వారి జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, ఇది క్రమంగా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

సోషల్ మీడియాకు బానిసలుగా మారితే ఉద్యోగం, విద్యా సామర్థంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సూచించింది. దీంతో ఆందోళన, డిప్రెషన్, వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్య సమస్యలు వస్తాయి.

 

కంపేరిజన్: సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వ్యక్తుల మధ్య కంపేరిజన్ ఎక్కువగా పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

జీవితం: సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులను చూసినప్పుడు వారు మంచి జీవితాన్ని గడుపుతున్నారనే ఆలోచన కలుగుతుంది. ఇది నెగిటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

సైబర్ భయాలు: అధికంగా దీనిని వాడుతున్న వారు సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరపు లింకులు క్లిక్ చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

శారీరక సమస్య: రోజులో ఎక్కువ సమయం సోషలో మీడియాలో గడపడం వల్ల అనేక శారీరక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది కళ్లు, మెదడు పనిచేసే తీరుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #SocialMedia #Life #SocialSkills