బెంగళూరులో రామేశ్వరం కెఫే పేలుడు! బాంబు దాడి వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం! ఎన్‌ఐఏ సంచలన వివరాలు!

Header Banner

బెంగళూరులో రామేశ్వరం కెఫే పేలుడు! బాంబు దాడి వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం! ఎన్‌ఐఏ సంచలన వివరాలు!

  Sat Nov 09, 2024 15:18        Others

బెంగళూరు శివారు బ్రూక్ఫీల్డ్లోని రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటనకు పాకిస్థాన్ తీవ్రవాదులకు సంబంధం ఉందని న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగపత్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ ఘటనలో తెర వెనుక సూత్రధారి, ఏ6 ఫైజల్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. బెంగళూరులో పేలుడు కన్నా ముందు మంగళూరులో కుక్కర్ బాంబు పేలింది. దానికి కారకులైన తాహా, షాజిబ్ మంగళూరు నుంచి పరారై బెంగళూరుకు చేరుకున్నారు. మరో నిందితుడు ముజామిల్ షరీఫ్త వారికి పరిచయమైంది. వారు ముజామిల్ను ఐసిస్లో చేర్పించారు. ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే తాము ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించేవారు. బెంగళూరులో పేలుడు జరపాలని ఆన్లైన్ హ్యాండ్లర్ ద్వారా 2023 డిసెంబరులో సందేశాన్ని పంపారు.



ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14




అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో (2024 జనవరి 22) బెంగళూరులో పేలుడు జరగాలని ఆదేశించారు. ముజామిల్ భాజపా కార్యాలయాన్ని ఎంపిక చేసుకున్నాడు. ముందు చెన్నైలోని ట్రిప్లికేన్కు వెళ్లి, అక్కడ ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు. ఐఈడీ బాండ్ తయారు చేసుకుని 2024 జనవరి 22 ఉదయమే బెంగళూరుకు చేరుకున్నాడు. భాజపా కార్యాలయం వద్ద భద్రత ఎక్కువగా ఉండడంతో భవంతి వెనుక భాగానికి వెళ్లి 90 నిమిషాల టైమర్ సెట్ చేశాడు. అయితే ఆ బాంబు పేలలేదు. మళ్లీ చెన్నైకు వెళ్లి బాంబు తయారు చేసుకుని ఫిబ్రవరి 29న బెంగళూరుకు చేరుకున్నారు. రామేశ్వరం కెఫేలో బాంబు ఉన్న సంచిని పెట్టి పరారయ్యాడు. ఆ పేలుడుతో పది మందికి పైగా వినియోగదారులు, సిబ్బంది గాయపడ్డారు. ముజామిల్తో పాటు తాహా, షాజిమ్లను ఎన్ఐఏ వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసింది. ఈ వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ తన అభియోగపత్రంలో పేర్కొంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!

 

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులునాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #banglore #bombblast #pakisthan #cafe #todaynews #flashnews #latestupdate