హెచ్ఎస్బీసీ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక! జాగ్రత్తగా ఉండండి! ఫేక్ కాల్స్, సోషల్ మీడియా మోసాలపై సూచన!

Header Banner

హెచ్ఎస్బీసీ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక! జాగ్రత్తగా ఉండండి! ఫేక్ కాల్స్, సోషల్ మీడియా మోసాలపై సూచన!

  Sat Nov 09, 2024 17:54        Others

హెచ్ఎస్బీసీ బ్యాంక్ (HSBC Bank) తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. బ్యాంక్ పేరిట వస్తున్న నకిలీ కాల్స్, సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈమేరకు కస్టమర్లకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మొబైల్ నంబర్లు, వాట్సప్ ఛానళ్ల గురించి తెలియజేసింది.
హెచ్ఎస్బీసీ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఐఓ (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) అయిన వేణుగోపాల్ మంఘాట్తో సంబంధం ఉన్నట్లు కొందరు తప్పుడు ధ్రువీకరణతో కస్టమర్లకు వల వేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రైవేట్ బ్యాంక్ తెలిపింది. '85-HSBC Global academy' పేరిట ఆ కేటుగాళ్లు వాట్సప్ గ్రూప్ నడుపుతున్నారని, ఇది సంస్థకు సంబంధించినది కాదని స్పష్టంచేసింది. '8008723938' ఫోన్ నంబర్తో వినియోగదారులను కేటుగాళ్లు కాంటాక్ట్ అవుతున్నారని, ఈ నంబర్ నుంచి వచ్చే కాల్స్ను నమ్మొద్దంటూ మెయిల్ ద్వారా కస్టమర్లకు సూచించింది. కేవలం వాట్సప్లోనే కాకుండా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డౌన్, యూట్యూబ్ వేదికగా మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ కాకుండా.. సంస్థ పేరిట వచ్చే ఇతర ప్లాట్ఫామ్లను ఆశ్రయించొద్దని తెలిపింది. పైన తెలిపిన నంబర్లతో వచ్చే కాల్స్ని ఫేక్గా గుర్తించాలని, అలాంటి వాట్సప్ గ్రూప్లలో జాయిన్ అవ్వొద్దంటూ కస్టమర్లను అలర్ట్ చేసింది. ఇలాంటి వారి వలలో పడొద్దని తెలుపుతూ.. హెచ్ఎస్బీసీ అధికారిక వెబ్సైట్, సోషల్మీడియా హ్యాండిల్స్ లింక్లను మెయిల్లో పంచుకుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!

 

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులునాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #hdfcbank #scams #fruad #whatsappgroups #todaynews #flashnews #latestupdate