ఇంటర్నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలు ఇవే! వాటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Header Banner

ఇంటర్నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలు ఇవే! వాటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  Sat Nov 09, 2024 18:03        India

భారతదేశంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా ట్రావెల్ వెబ్సైట్లో విదేశీ పర్యాటకులు అత్యధికంగా ఇంటర్నెట్ సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలను వెల్లడిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో భారతదేశంలో ఏయే పర్యాటక ప్రదేశాలు విదేశీయులకు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయో తెలిపింది. మరి ఓ సారి ఆ లిస్ట్ చూసేద్దామా..

 

1) ఢిల్లీ: ఇది భారతదేశానికి రాజధాని మాత్రమే కాదు. ఇది చరిత్ర, ఆధునికత కలయికతో కూడిన పురాతన నగరం. ఎర్రకోట, కుతుబ్ మినార్, తాజ్ మహల్, కరోల్ బాగ్, సరోజినీ నగర్, లజపత్ నగర్, చాందినీ చౌక్, సౌరీ బజార్, యాన్ మార్కెట్, ప్రశాంత లోధి గార్డెన్స్, అద్భుతమైన స్మారక చిహ్నాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి.

 

2) ముంబై: కలల నగరంగా పేరొందిన ముంబై విదేశీ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన నగరాల్లో రెండో స్థానంలో ఉంది. భారతదేశం ఆర్థిక రాజధానిగా, ఇది బాలీవుడ్, లైఫ్ స్టైల్, ఫ్యాక్టరీ నిర్మాణాలకు కొలువైనది.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

3) బెంగళూరు: భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు అందమైన వాతావరణం, ఉద్యానవనాలు, సరస్సులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. బెంగళూరులో బన్నెరఘట్ట నేషనల్ పార్క్, నంది హిల్స్, లాల్ బాగ్, కబ్బన్ పార్క్, బెంగుళూరు ప్యాలెస్, విధాన సౌధ, స్నో సిటీ, బెంగుళూరు ఫోర్ట్, కమర్షియల్ స్ట్రీట్ వంటి అనేక సందర్శనా స్థలాలు ఉన్నాయి.

 

4) జైపూర్: భారతదేశంలోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్ రాజస్థాన్ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ప్రవేశ ద్వారం. ఇది ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. అలాగే దేశ, విదేశాల నుండి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

 

5) చెన్నె: దేవాలయాలు, బ్రిటీష్ కాలం నాటి మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, దక్షిణ భారత సంస్కృతిని గొప్పగా చెప్పుకునే ప్రసిద్ధ మెరీనా బీచ్ చెన్నైకి ప్రధాన ఆకర్షణలు. విదేశీ పర్యాటకులు ఇంటర్నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

 

6) హంపి: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపి కర్ణాటకకు గర్వకారణం. ఇది బలమైన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎక్కువగా విదేశీయులను ఆకర్షిస్తుంది. దీనిని కూడా ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేసినదానిలో ఉంది.

 

7) హైదరాబాద్: కుల మతాలకు అతీతగా ఉన్న హైదరాబాద్లోని కొన్ని ప్రదేశాలను కూడా సెర్చ్ చేసినట్లు నివేదిక చెబుతోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా... 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Travel #Cities