తస్మా జాగ్రత్త: ఆ జిల్లాల్లో రూ.200, రూ.500 దొంగ నోట్ల కలకలం.. ఇలాంటి నోట్లు అస్సలు తీసుకోవద్దు!

Header Banner

తస్మా జాగ్రత్త: ఆ జిల్లాల్లో రూ.200, రూ.500 దొంగ నోట్ల కలకలం.. ఇలాంటి నోట్లు అస్సలు తీసుకోవద్దు!

  Sun Nov 10, 2024 08:00        India

ఈ డబ్బు పిచ్చితో, సులభంగా సంపాదించాలనే ఆలోచనతో, కొందరు మోసగాళ్లు వృద్ధులు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని కలర్ జిరాక్స్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. బత్తలపల్లి మండల కేంద్రంలో కొందరు చేతివాటం ద్వారా రూ.200, రూ.500 నోట్లను కలర్ జిరాక్స్ చేసి వృద్ధులు, చిన్న వ్యాపారులకు వాణిజ్య పరంగా ఉపయోగిస్తున్నారు. ఈ నకిలీ నోట్లను బ్యాంకుకు తీసుకెళ్ళినప్పుడు బ్యాంక్ అధికారులు వాటిని చూసి “ఇవి కలర్ పేపర్స్ మాత్రమే” అని తిప్పి పంపిస్తున్నారు. దీంతో బత్తలపల్లి ప్రాంతం నకిలీ నోట్లకు నిలయంగా మారింది. ఇటీవల కొందరు ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా మోసపోయారు. జొన్నరొట్టెలు అమ్మే ఓ వృద్ధురాలిని కూడా ఇలాగే మోసగించారు. ఈ మోసాల వల్ల చిరు వ్యాపారులు ప్రధానంగా బలవుతున్నారు. నకిలీ నోట్లను నిజమైనవిగా చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి నకిలీ నోట్ల సమస్యపై ఆర్బిఐ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడమే దీనికి పరిష్కారం. ఉదాహరణకు 500 రూపాయల నోటు మధ్యలో గ్రీన్ రంగు మెరుపులు ఉంటాయి. నోటును టిల్ట్ చేస్తే అవి బ్లూ రంగులోకి మారతాయి. అలాగే, నోటుపై కుడివైపున నాలుగు గీతలు తాకినప్పుడు స్వల్పంగా ఉబ్బుగా అనిపిస్తాయి, ఇవి అసలు నోట్ల సాక్ష్యం. 200 రూపాయల నోటులో ఇలాగే ఏడుగీతలు ఉంటాయి. 500 రూపాయల నోటు ఎడమ వైపున చిన్న బార్ కోడ్ వంటి ఒక లేటెంట్ ఇమేజ్ ఉంటుంది. దీనిని దగ్గరగా చూసినప్పుడు మాత్రమే నంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సూచనల ద్వారా నకిలీ నోట్లను ఈజీగా గుర్తించవచ్చు.


ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting