పెరిగిన యూపీఐ లావాదేవీలు! ఏడాదిలో 4000 ఏటీఎం మిషన్లు క్లోజ్!

Header Banner

పెరిగిన యూపీఐ లావాదేవీలు! ఏడాదిలో 4000 ఏటీఎం మిషన్లు క్లోజ్!

  Sun Nov 10, 2024 15:00        Business

కొన్నేళ్ల క్రితం మనకు డబ్బు కావాలంటే దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లి విత్అడ్రా చేసుకునే వాళ్లం. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజులు మారాయి. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేసి ఆన్లైన్లో ట్రాన్సక్షన్స్ జరుపుతున్నారు. ఇక చిరు వ్యాపారులు కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో మనీ కోసం చాలా మంది ఏటీఎంకు వెళ్లడం మానేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎంల నిర్వహణ బ్యాంకులకు కష్టంగా మారుతోంది. దీంతో భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం మిషన్లను మూసివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గత సంవత్సరం సుమారు 4000 ఏటీఎం మిషన్లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2024 నాటికి 2,15,767 ఏటీఎంలు ఉన్నాయి. కాగా గతేడాది సెప్టెంబర్ లో ఏటీఎంల సంఖ్య 2,19,281గా ఉంది. అంటే ఏటీఎంల సంఖ్య దాదాపు 1.6 శాతం తగ్గింది. ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్అ చేసేవారి సంఖ్య భారీగా తగ్గిపోవడంతో బ్యాంకులకు ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిపోతోంది. దీంతో బ్యాంకులు ఏటీఎంల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం మన ఇండియాలో రూ. 34.70 లక్షల కోట్ల డబ్బు చలామణిలో ఉంది. కాగా దేశంలో ప్రతి లక్ష మందికి 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #UPI #ATM