పోలీసులపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్! ఎందుకు అంటే!
Sun Nov 10, 2024 07:50 Politicsఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తరచుగా పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, మరోసారి పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సెప్టెంబరులో కాకినాడలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా... పవన్ నిన్న వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ, రోడ్డు ప్రమాదాల వేళ పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు విద్యార్థుల మృతి ఘటనలో పోలీసుల తీరు బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు పోలీసుల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. అంతటి బాధలో కూడా విద్యార్థి రేవంత్ అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన తల్లిదండ్రుల మానవత్వం కదిలించిందని అన్నారు. బాధిత కుటుంబాలకు సొంతంగా రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు బాధ్యతగా పనిచేయకపోతే, వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో కేసుల భయం కాకుండా, తక్షణ సాయం అవసరమని తెలిపారు. ఈ విషయంలో అవగాహన కల్పించే దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.