స్పైస్ కిచెన్‌లో భారీ పేలుడుతో జూబ్లీహిల్స్‌లో కలకలం! రాళ్లు ఎగిరి బస్తీలో విధ్వంసం, మహిళకు గాయాలు!

Header Banner

స్పైస్ కిచెన్‌లో భారీ పేలుడుతో జూబ్లీహిల్స్‌లో కలకలం! రాళ్లు ఎగిరి బస్తీలో విధ్వంసం, మహిళకు గాయాలు!

  Sun Nov 10, 2024 10:56        Others

నగరంలోని జూబ్లీహిల్స్లో భారీ పేలుడు సంభవించింది. దాని ప్రభావం పక్కనున్న బస్తీపై పడింది. శబ్ద తీవ్రతకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లో తెలంగాణ స్పైస్ కిచెన్ పేరుతో హోటల్ ఉంది. ఆదివారం ఉదయం అందులోని ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలింది. దీంతో హోటల్ ప్రహరీ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరి 100 మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. నాలుగు గుడిసెలు ధ్వంసమయ్యాయి. పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఓ మహిళకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డీసీపీ విజయ్కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. మరోవైపు హోటల్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనాస్థలాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #andhrapravasi #bombblast #jublihills #hotel #todaynews #flashnews #latestupdate