మ‌హిళ‌లు పాల‌కూర‌ను ఎక్కువ‌గా తినాలి! ఎందుకంటే?

Header Banner

మ‌హిళ‌లు పాల‌కూర‌ను ఎక్కువ‌గా తినాలి! ఎందుకంటే?

  Tue Nov 12, 2024 15:30        Health

సాధార‌ణంగా పురుషుల శ‌రీరం క‌న్నా స్త్రీల శ‌రీరంలోనే అనేక మార్పులు వ‌స్తుంటాయి. వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ ఈ మార్పులు ఎక్కువ‌వుతుంటాయి. క‌నుక వారు ఆరోగ్యం ప‌ట్ల అమిత‌మైన శ్ర‌ద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శ‌రీరంలో ఏర్ప‌డే మార్పుల‌కు త‌గిన‌ట్లుగా ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. ముఖ్యంగా స్త్రీ శ‌రీరంలో హార్మోన్ల ప‌రంగానే కాకుండా శారీర‌క ప‌రంగా కూడా ప‌లు మార్పులు వ‌స్తుంటాయి. అయితే ఈ మార్పుల‌కు అనుగుణంగా శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు గాను ప‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో పాల‌కూర ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌హిళ‌లు పాల‌కూర‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి.

 

ర‌క్త‌హీన‌త‌కు..
మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి స‌మ‌యంలోనే కాకుండా పిల్ల‌ల‌కు జ‌న్మ ఇచ్చిన‌ప్పుడు ర‌క్తం ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతుంది. త‌గినంత ఐర‌న్ లేక‌పోతే ర‌క్త‌హీన‌త ఏర్ప‌డుతుంది. అయితే పాల‌కూర‌లో ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటుంది క‌నుక ఐర‌న్ లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు. అందుకు గాను ఆయా స‌మ‌యాల్లో మ‌హిళ‌లు పాల‌కూర‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. దీంతో శ‌రీరం నుంచి పోయే ర‌క్తాన్ని భ‌ర్తీ చేయ‌వ‌చ్చు. సాధార‌ణంగా 100 గ్రాముల పాల‌కూర‌ను తింటే 2.7 మిల్లీగ్రాముల మేర ఐర‌న్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ర‌క్త‌హీన‌త రాకుండా చూసుకోవ‌చ్చు. 

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

గ‌ర్భిణీల‌కు..
గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌ల‌కు ఫోలేట్ అనేక పోష‌క ప‌దార్థం ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతుంది. ఇది బిడ్డ ఎదుగుల‌కు ఎంత‌గానో అవ‌స‌రం. పుట్టుక‌తో పిల్ల‌ల‌కు లోపాలు రాకుండా ఉండేందుకు గాను ఫోలేట్ ఉండే ఆహారాల‌ను తింటుండాలి. డాక్ట‌ర్లు సాధార‌ణంగా గ‌ర్భిణీల‌కు ఫోలేట్ ఉండే ట్యాబ్లెట్ల‌ను ఇస్తారు. వాటితోపాటు పాల‌కూర‌ను కూడా త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో 100 గ్రాముల పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల సుమారుగా 165 మైక్రోగ్రాముల మేర ఫోలేట్ ల‌భిస్తుంది. ఇది త‌ల్లికి, బిడ్డ‌కు ఇద్ద‌రికీ మేలు చేస్తుంది. వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

కీళ్ల నొప్పులు త‌గ్గేందుకు..
పాల‌కూర‌లో క్యాల్షియం కూడా స‌మృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల పాల‌కూర‌ను తింటే 99 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం ల‌భిస్తుంది. ఇది స్త్రీల ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో వారికి ఆస్టియో పోరోసిస్‌, ఆర్థరైటిస్ వంటి ఎముక‌లు స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శారీర‌కంగా ఉండే నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి. పాల‌కూర‌లో మెగ్నిషియం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. 100 గ్రాముల పాల‌కూర ద్వారా 79 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం ల‌భిస్తుంది. ఇది స్త్రీల కండ‌రాల ప‌నితీరుకు ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. దీంతోపాటు బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి, బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. 

 

పాల‌కూర‌లో విట‌మిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం త్వ‌ర‌గా గడ్డ క‌ట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం ముప్పు మ‌హిళ‌ల‌కు త‌ప్పుతుంది. పాల‌కూర‌లో 100 గ్రాముల‌కు గాను 482.9 మైక్రోగ్రాముల మేర విట‌మిన్ కె ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా పాల‌కూరతో ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి క‌నుక మ‌హిళ‌లు త‌ప్ప‌కుండా దీన్ని త‌ర‌చూ తీసుకోవాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Spinach #Foods