వైసీపీలా కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు చెప్పిన చంద్రబాబు! తన అనుభవాలు పంచుకున్న సీఎం!

Header Banner

వైసీపీలా కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు చెప్పిన చంద్రబాబు! తన అనుభవాలు పంచుకున్న సీఎం!

  Tue Nov 12, 2024 15:50        Politics

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు విరామం కావడంతో ఎమ్మెల్యేలకు బడ్జెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలోని అనుభవాలను ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడం, విలువలకు కట్టుబడి ఉండడం, ప్రజా ఉపయోగ రాజకీయాలు చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని అభిలషించారు. ప్రజా సమస్యల వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులందరిలో నేనే సీనియర్. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, స్వల్పకాలిక చర్చలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రశ్నోత్తరాల్లో అవకాశం రాకపోతే... లఘు చర్చలు, జీరో అవర్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించడం ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపొచ్చని అన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ నియమనిబంధనలు తెలుసుకోవాలని అయ్యన్న స్పష్టం చేశారు.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews