ఓటీటీ వైపు నుంచి మెప్పిస్తున్న 'నందన్' మూవీ! గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో!

Header Banner

ఓటీటీ వైపు నుంచి మెప్పిస్తున్న 'నందన్' మూవీ! గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో!

  Wed Nov 13, 2024 10:59        Entertainment

తమిళంలో ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో 'నందన్' ఒకటి. ఎరా శరవణన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో శశికుమార్ - సురుతి పెరియస్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. గిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేశారు. అయితే అప్పుడున్న పోటీ వలన ఈ సినిమాకి థియేటర్లు దొరకడం కష్టమైపోయింది. అందువల్ల ఆ హడావిడిలో ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా తమిళంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది.  అయితే థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేకపోయిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్టుగా తెలుస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈ కంటెంట్ కనెక్ట్ అయిందని అంటున్నారు. కథలోకి వెళితే... అది ఒక గ్రామం... ఆ గ్రామానికి ప్రెసిడెంట్ గా పెద్దకోపు లింగం (బాలాజీ శక్తివేల్) ఉంటాడు. చాలా కాలంగా అదే కులానికి సంబంధించిన... అదే కుటుంబానికి సంబంధించినవారే అక్కడ పెత్తనం చేస్తుంటారు. తక్కువ కులాల వారి పట్ల నియంతృత్వం చూపిస్తుంటారు. ప్రెసిడెంట్ కోపులింగం అంటే అంబేద్ కుమార్ (శశి కుమార్)కి ఎంతో అభిమానం. తన స్వార్థం కోసం అతణ్ణి పావుగా ఉపయోగించుకోవడానికి ప్రెసిడెంట్ ట్రై చేస్తాడు. పర్యవసానంగా ఏం జరుగుతుందనేది కథ. త్వరలో తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి.

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove