రామ్ గోపాల్ వర్మకు నోటీసులు..ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌లో! అసభ్యకర పోస్టులపై చట్టం కఠినం!

Header Banner

రామ్ గోపాల్ వర్మకు నోటీసులు..ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌లో! అసభ్యకర పోస్టులపై చట్టం కఠినం!

  Wed Nov 13, 2024 11:42        Cinemas

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలు దేరివెళ్లారు. ఎన్నికలకు ముందు 'వ్యూహం' సినిమా ప్రమోషన్ సమయంలో.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు. వ్యక్తిగతంగా వాటిని అందజేసేందుకు ఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం నోటీసులు అందజేసే అవకాశం ఉంది. ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్.శ్రీకాంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.


ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14


పోసానిపై కేసు నమోదు
భవానీపురం: సినీ నటుడు, వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) పై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో 2021 సెప్టెంబరు 28న, 2024 ఏప్రిల్ 22న వైకాపా కార్యాలయం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ప పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పేర్కొన్నారు. ఆ వీడియోలను వైకాపా సోషల్ మీడియా ఎక్కువగా వినియోగిస్తూ పవన్కల్యాణ్ ప్రతిష్టను దెబ్బ తీస్తోందని తెలిపారు. పోసాని కృష్ణమురళి, వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీరెడ్డిపై అనకాపల్లిలో ఫిర్యాదు
అనకాపల్లి పట్టణం: సామాజిక మాధ్యమంలో చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డి (Sri Reddy)పై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, కె. వసంత ఫిర్యాదు అందించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #cinedirector #ramgopalvarma #todaynews #flashnews #latestupdate