విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం! విస్తృత పార్కింగ్ సౌకర్యాలతో డిజైన్ ఆకర్షణీయంగా!

Header Banner

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం! విస్తృత పార్కింగ్ సౌకర్యాలతో డిజైన్ ఆకర్షణీయంగా!

  Tue Nov 26, 2024 11:18        Others

విశాఖ కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. భవన సముదాయాన్ని బీ1+బీ2+జీ+9 (బేస్మెంట్ 1, 2, గ్రౌండ్, 9 అంతస్తులు)గా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందుకు సంబంధించిన డీపీఆర్లో పేర్కొన్న ఆకృతి ఆకట్టుకుంటోంది. మొత్తంగా భవనాన్ని 27,548.3 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొదటి అంతస్తు 3,222.83 చదరపు మీటర్లు, మిగిలిన అంతస్తుల్లో ఒక్కోదాన్ని 2,702.83 చదరపు మీటర్ల మేర నిర్మిస్తారు.
వాహనాల పార్కింగుకు మొదటి బేస్మెంట్లో వంద కార్లు, 125 ద్విచక్ర వాహనాలు, రెండో బేస్మెంట్లో వంద కార్లు, 90 ద్విచక్ర వాహనాలు, ఆరుబయట పార్కింగ్ స్థలంలో 90 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు నిలిపేలా డిజైన్ చేశారు. కింది అంతస్తులో కంట్రోల్ రూమ్, ఆడిటోరియం, బ్యాక్ ఆఫీసు, వంటశాల వంటివి ఉంటాయి. మొదటి అంతస్తులో కమర్షియల్, సీపీఆర్వో ఉంటారు. రెండో అంతస్తులో జోనల్ కంట్రోల్ రూం, భద్రత, మరికొన్ని విభాగాలుంటాయి. మూడులో రిజర్వేషన్, టెలీ ఎక్స్ఛేంజ్ కార్యాలయం, సమావేశాల గది, ఐటీ విభాగాలుంటాయి. నాలుగులో ఆర్థిక, గణాంక, ఇంజినీరింగ్, గ్రంథాలయం, అయిదులో ఆపరేటింగ్ విభాగం, స్టోర్, ఏడీజీఎం, జీఎం కార్యాలయం, సెక్రటరీ, అనుబంధ విభాగాలుంటాయి. ఆరులో ఆఫీసు స్పేస్, ఏడులో విపత్తుల నిర్వహణ, సెక్రటరీ, ఏజీఎం గది, ఎస్జీజీఎం, వైద్య విభాగం, ఎనిమిదిలో పర్సనల్ విభాగం, క్యాంటీన్, తొమ్మిదిలో ఎలక్ట్రికల్, మెకానికల్, సమావేశ మందిరాలుంటాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #railwayzone #buldingconstruction #vizag #railway #development #todaynews #flashnews #latestupdate