నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

Header Banner

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

  Tue Nov 26, 2024 12:09        Cinemas

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు... 'వ్యూహం' సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కించపరిచే కామెంట్లు చేసిన వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసు విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  మరోవైపు, వర్మ విచారణకు హాజరుకాకపోవచ్చనే అనుమానంతో... హైదరాబాద్ లోని వర్మ నివాసం వద్దకు నిన్న ఒంగోలు పోలీసులు వెళ్లారు.

 

ఇంకా చదవండి: నాగచైతన్యపై సమంత కామెంట్! కొన్ని రోజుల్లో పెళ్లి - మాజీ భర్తకు ఇచ్చిన బహుమతి!

 

వర్మను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారనే వార్తలు వచ్చాయి. అయితే, వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో, ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇంకోవైపు, వర్చువల్ గా పోలీసు విచారణకు హాజరవుతారని పోలీసులను వర్మ తరపు లాయర్లు కోరుతున్నారు. అయితే వర్చువల్ విచారణకు పోలీసులు అంగీకరించలేదు. మరోవైపు, ఈరోజు ఏపీ హైకోర్టులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

 

ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #RamGopalVarma #Nagababu #Tollywood #NagababuComment #RamGopalVarmaComment #APDJP #AndhraPradesh