అమెరికా: ట్రంప్ మొద‌లెట్టేశారుగా.. ఆ దేశాల‌పై ప‌న్నుల బాంబ్‌! ఈ విధాన‌మే వాణిజ్య భాగ‌స్వాముల‌తో!

Header Banner

అమెరికా: ట్రంప్ మొద‌లెట్టేశారుగా.. ఆ దేశాల‌పై ప‌న్నుల బాంబ్‌! ఈ విధాన‌మే వాణిజ్య భాగ‌స్వాముల‌తో!

  Tue Nov 26, 2024 11:55        U S A

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప‌లు దేశాల నుంచి దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల ప‌న్నుల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ప్ర‌ధానంగా కెన‌డా, మెక్సికో, చైనా వ‌స్తువుల‌పై ప‌న్నుల పెంపున‌కు ఆయ‌న సిద్ధమ‌య్యారు. మెక్సికో, కెన‌డాల‌పై 25 శాతం... చైనాపై 10 శాతం ప‌న్నులు విధించే ప‌త్రాల‌పై జ‌న‌వ‌రి 20న సంతకాలు చేయ‌నున్న‌ట్లు సోమ‌వారం ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్రూత్ సోషల్ మీడియా వేదిక‌గా ఒక పోస్ట్ చేశారు. చ‌ట్ట విరుద్ధ‌మైన వ‌ల‌స‌లు, మాద‌క ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రాకు వ్య‌తిరేకంగా తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. "జనవరి 20న నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా, మెక్సికో, కెనడా దేశాల‌ నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించడానికి అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తాను" అని ట్రంప్ త‌న పోస్టులో రాశారు. అలాగే చైనా నుంచి దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల‌పై 10 శాతం ప‌న్ను విధించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు మ‌రో పోస్టులో రాసుకొచ్చారు. ఇక అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్ మ‌రికొన్ని రోజుల్లో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆయ‌న‌ ఆర్థిక ఎజెండాలో సుంకాలు కీలకమైనవి. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఈ విష‌యాన్ని ట్రంప్ ప‌లుమార్లు ప్ర‌స్తావించారు కూడా. తాను ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌యితే వివిధ దేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల‌పై ప‌న్నులు విధిస్తాన‌ని తెలిపారు. అన్న‌ట్టుగానే ఇప్పుడు ఈ నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. కాగా, ఈ టారిఫ్ విధానం దేశ అభివృద్ధి, ద్ర‌వ్యోల్బ‌ణంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఎక‌న‌మిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. కానీ, ఈ విధాన‌మే వాణిజ్య భాగ‌స్వాముల‌తో బేర‌సార‌ల్లో కీల‌క‌మ‌వుతుంద‌ని ట్రంప్ మ‌ద్ద‌తుదారులు చెబుతున్న‌మాట‌

 

ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #DonaldTrump #USA #RepublicanParty