ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

Header Banner

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

  Tue Nov 26, 2024 17:09        Politics

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైకాపా సభ్యులు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 164 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైకాపా సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే, ఈ 3 స్థానాలను తెదేపా తీసుకుంటుందా? భాగస్వామ్య పక్షాలైన భాజపా, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా? అనేదానిపై చర్చ జరుగుతోంది.



ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



II స్థానాల నుంచి పతనం దిశగా వైకాపా..
రాజ్యసభలో మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకున్న వైకాపా పతనం మొదలైంది. 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 2020, 2022, 2024 ఫిబ్రవరిల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలను దక్కించుకుంది. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాభవం పాలైంది. ఆ తర్వాత 100 రోజుల్లోనే జగన్ పార్టీ రాజ్యసభలో మూడు స్థానాలను కోల్పోయింది. ప్రస్తుతం రాజ్యసభలో తెదేపా సభ్యుడు ఒక్కరు కూడా లేరు. తాజా ఉప ఎన్నికల తర్వాత తెదేపా సభ్యులు రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #rajyasabhaelections #kutami #winning #politics #assembly #todaynews #flashnews #latestupdate