ట‌మాటా, క్యారెట్లు, పాల‌కూర‌ను ఉడ‌క‌బెట్టి తినాలా? ప‌చ్చిగా తినాలా?

Header Banner

ట‌మాటా, క్యారెట్లు, పాల‌కూర‌ను ఉడ‌క‌బెట్టి తినాలా? ప‌చ్చిగా తినాలా?

  Tue Nov 26, 2024 19:10        Health

క్యారెట్లు, పాల‌కూర‌, ట‌మాటాల‌ను పోష‌కాల ప‌రంగా చూస్తే సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే వీటిల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక వీటిని తినాల‌ని న్యూట్రిష‌నిస్టులు సైతం చెబుతుంటారు. అయితే కొంద‌రు వీటిని ప‌చ్చిగానే తింటుంటారు. ఉడ‌క‌బెట్టి తింటే వాటిలో పోష‌కాలు ఉండ‌వ‌ని భావిస్తారు. అందుక‌నే కొంద‌రు వీటిని ప‌చ్చిగా తింటారు. కూర‌గాయ‌ల‌ను ఉడ‌క‌బెట్ట‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే పోష‌కాలు న‌శిస్తాయ‌ని చాలా మంది విశ్వ‌సిస్తుంటారు కూడా. అయితే ఇందులో కాస్త నిజం ఉన్న‌ప్ప‌టికీ అన్ని కూర‌గాయ‌లు అలా కాదు. కొన్ని కూర‌గాయ‌ల‌ను మాత్ర‌మే ప‌చ్చిగా తింటే మంచిది. కొన్నింటిని ఉడికిస్తేనే వాటిల్లో పోష‌క విలువ‌లు పెరుగుతాయి.

 

గ్యాస్ ట్ర‌బుల్ ఉంటే..?
అయితే ప‌చ్చి కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌ను కొంద‌రు తిన‌కూడ‌ద‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. వీటిల్లో ఫైబ‌ర్, స‌హ‌జ‌సిద్ధ‌మైన స‌మ్మేళ‌నాల కార‌ణంగా వీటిని తింటే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, పొట్ట‌లో అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య ఉన్న‌వారు కూర‌గాయ‌ల‌ను లేదా ఆకు కూర‌ల‌ను ప‌చ్చిగా తింటే స‌మ‌స్య మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంటుంద‌ని అంటున్నారు.


క్యారెట్లు..
క్యారెట్ల‌లో బీటా కెరోటిన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అయితే క్యారెట్ల‌ను చాలా మంది ప‌చ్చిగానే తింటుంటారు. క్యారెట్ల‌ను ప‌చ్చిగా తిన‌డం వ‌ల్ల వీటిల్లో ఉండే విట‌మిన్ సి ని పొంద‌వ‌చ్చు. కానీ క్యారెట్ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ శాతం పెరుగుతుంది. అంటే మ‌న‌కు విట‌మిన్ ఎ అధికంగా ల‌భిస్తుంద‌న్న‌మాట‌. క‌నుక విట‌మిన్ ఎ ను కోరుకునే వారు క్యారెట్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌డం మంచిది. విట‌మిన్ సి కావాల‌నుకునే వారు క్యారెట్ల‌ను నేరుగా అలాగే ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


పాల‌కూర‌..
పాల‌కూర‌లో ఐర‌న్‌, క్యాల్షియం, విట‌మిన్లు ఎ, కె ఉంటాయి. అయితే ప‌చ్చి పాల‌కూర‌లో ఆగ్జ‌లేట్స్ పుష్క‌లంగా ఉంఆయి. ఇవి శ‌రీరాన్ని క్యాల్షియం, ఐర‌న్ శోషించుకోనీయ‌కుండా చేస్తాయి. దీంతో కిడ్నీల్లో స్టోన్స్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. క‌నుక పాల‌కూర‌ను ఎప్పుడూ ఉడ‌క‌బెట్టి మాత్ర‌మే తినాలి. ప‌చ్చిగా తిన‌కూడ‌దు. ప‌చ్చిగా తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డే అవ‌కాశాలు పెరుగుతాయి. ఇక కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారు పాల‌కూర‌ను ఉడ‌క‌బెట్టి కూడా తిన‌కూడ‌దు. స్టోన్లు మ‌ళ్లీ ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.


ట‌మాటాలు..
ట‌మాటాల్లో విట‌మిన్ సి, పొటాషియం, లైకోపీన్ అధికంగా ఉంటాయి. లైకోపీన్ అనేది ఒక శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది గుండె ప‌నితీరును మెరుగు ప‌రిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్స‌ర్ రాకుండా చూస్తుంది. ట‌మాటాల‌ను వండ‌డం వ‌ల్ల విట‌మిన్ సి శాతం కాస్త పోయిన‌ప్ప‌టికీ వాటిల్లో లైకోపీన్ శాతం పెరుగుతుంది. క‌నుక లైకోపీన్ కావ‌ల్సిన వారు ట‌మాటాల‌ను ఉడ‌క‌బెట్టి తింటేనే మేలు జ‌రుగుతుంది. ఇలా ప‌లు ర‌కాల కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌ను భిన్న ర‌కాలుగా తీసుకోవ‌డం వ‌ల్ల భిన్న ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఇత‌ర కూరగాయ‌ల్లో కీర‌దోస‌, చిల‌గ‌డ‌దుంప‌లు వంటి వాటిని కూడా ప‌చ్చిగా లేదా ఉడ‌క‌బెట్టి తిన‌వ‌చ్చు. చిల‌గ‌డ‌దుంప‌ల‌ను కూడా ఉడ‌క‌బెట్టి తింటే విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా కూర‌గాయ‌ల‌ను తింటే భిన్న ర‌కాల విట‌మిన్ల‌ను, మిన‌ర‌ల్స్‌ను పొంద‌వ‌చ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Health #Vegetables #Fruits