టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ‌ లిరిక్ రైట‌ర్ క‌న్నుమూత‌! హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో!

Header Banner

టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ‌ లిరిక్ రైట‌ర్ క‌న్నుమూత‌! హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో!

  Tue Nov 26, 2024 17:35        Entertainment

ఆసుపత్రిలో క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్‌ చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. పాట‌ల ర‌చ‌యిత‌గా ఓ వెలుగు వెలిగిన ఆయ‌న త‌ర్వాతి రోజుల్లో మాన‌సికంగా చాలా కుంగిపోయారు. విశాఖ‌ప‌ట్నంకు చెందిన కుల‌శేఖ‌ర్ మొద‌ట హైద‌రాబాద్‌లో జ‌ర్న‌లిస్టుగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత లిరిక్ రైట‌ర్‌గా మారారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెళకువలు తెలుసుకున్నారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ తేజ దర్శకత్వంలో వ‌చ్చిన ‘చిత్రం’ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'జయం', 'నువ్వు నేను', 'భ‌ద్ర', 'సంతోషం', 'ఔనన్నా కాదన్నా', 'వసంతం', 'రామ్మా చిలకమ్మా', 'వసంతం', 'మృగరాజు', 'సుబ్బు', 'సైనికుడు' వంటి చిత్రాల్లో సూపర్‌హిట్ పాట‌లు రాశారు. కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్ అనుకున్న విధంగా సాగ‌లేదు. దాంతో మాన‌సికంగా కుల‌శేఖ‌ర్ కుంగిపోయారు. ఓ రకమైన మానసిక రుగ్మత కారణంగా దొంగతనాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసు‌ల్లో పలుమార్లు జైలుకి కూడా వెళ్లొచ్చారు.  గత కొన్నేళ్లుగా పెద్ద‌గా సినిమా పాట‌లు రాయ‌లేదు. బ‌య‌ట కూడా క‌నిపించ‌లేదు. అలాంటిది ఇప్పుడు ఆయ‌న చ‌నిపోయార‌ని తెలిసి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా, కుల‌శేఖ‌ర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

 

ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove