ఇక చాలు.. మరోసారి గొడవ చేస్తే తీవ్ర చర్యలు! మంచు విష్ణుకు తేల్చి చెప్పిన సీపీ!
Thu Dec 12, 2024 16:40 Cinemasఫ్యామిలీ గొడవలకు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోదరులు మనోజ్, విష్ణు.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్ హోదాలో సీపీ వారిని విచారించారు. ఈ సందర్భంగా.. కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ వారికి సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొదట మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఏడాదిపాటు ప్రతికూల చర్యలకు దిగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.1లక్ష పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం మంచు విష్ణు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సీపీ సుధీర్ బాబు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యల గురించి తెలియజేస్తామన్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.