రోజూ లంచ్‌లో ఈ ఫుడ్స్‌ను తింటున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

Header Banner

రోజూ లంచ్‌లో ఈ ఫుడ్స్‌ను తింటున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

  Fri Dec 27, 2024 14:11        Health

రోజూ మ‌నం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్ చేస్తుంటాం. అయితే బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ను కాస్త ఎక్కువ‌గానే తింటుంటాం. దీంతోపాటు చాలా సంద‌ర్భాల్లో ఈ ఆహారాల‌తోపాటు జంక్ ఫుడ్‌ను కూడా తింటుంటాం. అయితే ఇలా తిన‌డం ఆరోగ్యానికి అస‌లు మంచిది కాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం డిన్న‌ర్‌లో ర‌క‌ర‌కాల జంక్ ఫుడ్‌ల‌ను తింటుంటారు. నూనె ప‌దార్థాలు కూడా వాటిల్లో ఉంటాయి. అయితే ఇలా తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోతార‌ని వారు అంటున్నారు. ఈ మేర‌కు సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యంలో జంక్ ఫుడ్‌ను అధికంగా తింటున్నార‌ని తేలింది.

 

ఫాస్ట్ ఫుడ్‌..
మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యంలో జంక్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చేరే క్యాలరీలు పెరిగిపోతాయి. కానీ అందుకు త‌గిన వ్యాయామం ఉంటే ఏమీ కాదు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో చాలా మంది రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుంటున్నారు కానీ వ్యాయామం చేయ‌డం లేదు. దీంతో మ‌ధ్యాహ్నం చేస్తున్న లంచ్ కార‌ణంగానే చాలా మంది అధికంగా బ‌రువు పెరిగిపోతున్నార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక అధికంగా బ‌రువు పెరిగిపోవ‌డానికి ప‌లు ఆహారాలు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని వారు అంటున్నారు. ఉద‌యం హ‌డావిడిలో చాలా మంది లంచ్ బాక్స్ పెట్టుకోరు. దీంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో స‌మ‌యం లేద‌నో, మ‌రేదైనా కార‌ణాల వ‌ల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌ను తింటుంటారు. ఇది అస‌లు ఏమాత్రం మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే కానీ రోజూ మ‌ధ్యాహ్నం లంచ్‌లో భాగంగా ఫాస్ట్ ఫుడ్‌ను తింటే అది మ‌న ఆరోగ్యంపై దుష్ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని డాక్ట‌ర్లు సైతం చెబుతున్నారు. క‌నుక లంచ్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!  

 

ఇంకా చదవండిగుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు.. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

చాక్లెట్లు, బిస్కెట్లు..
ఇక కొంద‌రు లంచ్ చేయ‌కుండా చాక్లెట్లు, బిస్కెట్లు వంటి వాటిని మ‌ధ్యాహ్నం టైమ్‌లో తింటుంటారు. వాస్త‌వంగా చెప్పాలంటే మ‌ధ్యాహ్నం అన్నం తిన్నా ఓకే కానీ ఇలా చాక్లెట్లు, బిస్కెట్ల‌ను తింటే శ‌ర‌రీంలో అన‌వ‌స‌రంగా క్యాల‌రీలు చేరుతాయి. ఈ ప‌దార్థాల్లో ఉండే మైదా పిండి, చ‌క్కెర మ‌న ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి. మ‌న బ‌రువు పెరిగేలా చేస్తాయి. దీంతోపాటు టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతాయి. క‌నుక మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో వీటిని కూడా తిన‌రాదు. అలాగే కొంద‌రు లంచ్ లో భాగంగా స‌లాడ్స్ ను క్రీముల‌తో తింటుంటారు. స‌లాడ్స్ ఆరోగ్యానికి మంచివే అయిన‌ప్ప‌టికీ వాటిపై క్రీమ్ వేయ‌డం వ‌ల్ల స‌లాడ్స్‌ను తిన్నా ఉప‌యోగం ఉండ‌దు. పైగా క్రీములు మ‌న ఆరోగ్యానికి హానిక‌రం. క‌నుక క్రీము లేకుండా స‌లాడ్స్‌ను తింటే మేలు జ‌రుగుతుంది. 

 

కూల్ డ్రింక్స్‌..
మ‌ధ్యాహ్నం లంచ్‌లో భాగంగా కొంద‌రు ప్రాసెస్ చేయ‌బ‌డిన మాంసాహారాల‌ను కాస్త ఎక్కువ‌గానే తింటుంటారు. వాస్త‌వానికి ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి హాని చేస్తాయి. శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీంతో గుండె పనితీరు దెబ్బ తింటుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. కాబ‌ట్టి ప్రాసెస్ చేయ‌బ‌డిన మాంసాహారాల‌కు సైతం దూరంగా ఉండాలి. అలాగే కొంద‌రు లంచ్‌లో కూల్ డ్రింక్స్ లేదా పండ్ల ర‌సాల‌ను తాగుతుంటారు. ఇవి మ‌న బ‌రువును పెంచుతాయి క‌నుక వీటికి కూడా దూరంగా ఉండాలి. ఇలా ప‌లు ర‌కాల ఆహారాల‌ను లంచ్‌లో తీసుకోవ‌ద్దు. దీంతో బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గుండెకు హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

  

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Foods #Diet #FastFood