తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు ఆమోదం! లైజన్ ఆఫీసర్‌ నియామకం!

Header Banner

తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు ఆమోదం! లైజన్ ఆఫీసర్‌ నియామకం!

  Sat Dec 28, 2024 12:58        Devotional

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల పైన దర్శనం, వసతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ నేతల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించాలని కోరుతున్నారు. దీని పైన తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ అభ్యర్ధన మేరకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సూచనతో టీటీడీ ఇక తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల ఆమోదం పై నిర్ణయం తీసుకుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

ఇక నుంచి ఏపీతో పాటుగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల దర్శనం, వసతి కోసం ఇచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించాలని టీటీడీ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమలలో తమ లేఖలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు లేఖలు ఇచ్చేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ వచ్చారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు - రేవంత్ మధ్య తాజాగా ఇదే అంశం పైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు తిరుమలలో ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సీఎం రేవంత్ అభ్యర్ధన మేరకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే స్వామి వారి దర్శనం.. వసతి, సేవల విషయంలో ఏపీ ప్రజా ప్రతినిధుల తరహాలోనే అవకాశం కల్పించాలని టీటీడీకి సూచించారు. దీంతో, టీటీడీ తాజాగా ఈ అంశం పైన నిర్ణయం వెలువరించింది. ఇక నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం హోదాలో ఉన్న వారు ఇచ్చే సిఫార్సు లేఖలను ప్రతీ వారం రెండు రోజుల పాటు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు వెసులుబాటు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలుకు నిర్ణయించారు. దీంతో, కొత్త ఏడాది నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించనుంది. దర్శనం, వసతి మరియు ఇతర ఆలయ సంబంధిత కార్యకలాపాలను సులభతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున టీటీడీలో పని చేయడానికి సి.గణేష్ కుమార్ లైజన్ ఆఫీసర్‌గా నియమించడం జరిగింది.

TTD TG Liaison Officer (2).jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

  

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati