బాక్సింగ్ డే టెస్టు.. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ స్కోరు!

Header Banner

బాక్సింగ్ డే టెస్టు.. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ స్కోరు!

  Sat Dec 28, 2024 13:45        Sports

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ బాక్సింగ్ డే టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 358 ప‌రుగులు చేసింది. టీమిండియా బ్యాట‌ర్ల‌లో నితీశ్ కుమార్ రెడ్డి అజేయ శ‌త‌కం (105 నాటౌట్‌)తో జ‌ట్టును ఆదుకున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50)తో క‌లిసి 127 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించాడు. ఇక ఓవ‌ర్‌నైట్ స్కోర్‌ 164/5 తో మూడోరోజు ఆట ప్రారంభించిన భార‌త్‌కు రిష‌భ్ పంత్ (28), ర‌వీంద్ర జ‌డేజాను స్వ‌ల్ప వ్య‌వధిలోనే పెవిలియ‌న్‌కు పంపించి ఆసీస్ పైచేయి సాధించింది. దీంతో టీమిండియా 221 ప‌రుగుల‌కే 7 వికెట్లు పారేసుకుంది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ సుంద‌ర్‌తో క‌లిసి నితీశ్ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు. భార‌త్‌ను ఫాలో-ఆన్ గండం నుంచి కాపాడ‌డంతో పాటు భారీ స్కోర్ సాధించేలా చేశాడు. ఈ క్ర‌మంలో తొలి టెస్టు సెంచ‌రీ న‌మోదు చేశాడు. మ‌రికొద్దిసేప‌ట్లో ఆట ముగుస్తుంద‌న‌గా వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. ఎంత‌కూ వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు ఆట‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా 358/9 స్కోర్ చేసింది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి (105), మ‌హ్మ‌ద్‌ సిరాజ్ (02) ఉన్నారు. ఆసీస్ కంటే భార‌త్ ఇంకా 116 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ప్యాట్ క‌మ్మిన్స్, బొలాండ్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్పిన్న‌ర్‌ నాథ‌న్ లైయ‌న్ 2 వికెట్లు తీశాడు. కాగా, ఆతిథ్య జ‌ట్టు త‌న తొలి ఇన్నింగ్స్‌లో 474 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.      

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Sports #Indiateam #Cricket #NewZealand