నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు! మాజీ మంత్రి పేరుతో...!

Header Banner

నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు! మాజీ మంత్రి పేరుతో...!

  Fri Dec 27, 2024 14:46        Politics

నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం. బియ్యమే బస్తాలు స్వయంగా కౌంట్ చేసిన మహేష్ నాయుడు.. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో 398 బియ్యం బస్తాలు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. మరో ప్రైవేట్ గోదాములో 685 బస్తాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. బియ్యం స్టాక్ పై జిల్లా మేనేజర్ ను రికార్డులు అడిగిన మహేష్.. ఇప్పటి వరకు రికార్డులు జిల్లా మేనేజర్ ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంపై సివిల్ సప్లై ఎండికి, జాయింట్ కలెక్టర్ కు డైరెక్టర్ సమాచారం ఇచ్చారు.



ఇంకా చదవండి7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!



1300 బస్తాలు రేషన్ బియ్యం మాయం అయ్యాయని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలపై రెవెన్యూ అధికారులు నోరు మేదపడం లేదు. రికార్డులు సరిగాలేవని డైరెక్టర్ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. ప్రతిరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు చేయాల్సిన అధికారులు.. అక్రమాలు వెంటనే బయటపడే అవకాశం వున్నా అధికారుల మౌనంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోనసీమ నుంచి బేతంచెర్ల గోదాములకు, పాలకొన్లు నుంచి నంద్యాల గోదాములకు రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే బేతంచెర్ల కు పాలకొల్లు నుంచి నిన్న బియ్యం సరఫరా అయ్యింది. అక్రమాలు బయట పడతాయని అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. బేతంచెర్ల గోదాముల్లో ఒకటి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #rice #godown #checking #ride #civilsupply #todaynews #flashnews #latestupdate