నేటి 28/12 తాజా వార్తలు టూకీగా..! వివిధ వార్తా పత్రికలలో! 39 తాజా అంశాలు!

Header Banner

నేటి 28/12 తాజా వార్తలు టూకీగా..! వివిధ వార్తా పత్రికలలో! 39 తాజా అంశాలు!

  Sat Dec 28, 2024 08:34        Exclusives

ఈనాడు

  1. సన్నాలే కావాలంటే సాగు తీరు మారాలి – ప్రస్తుతం 36 శాతం విస్తీర్ణంలోనే సన్నరకం  – 62 శాతంత దొడ్డు రకాలే –అవే పేదల కిచ్చే బియ్యం – అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబంధకాలు
  2. దీక్షాదక్షుడికి అశ్రు నివాళులు –మన్మోహన్ సింగ్ పార్దివదేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి – శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ – నేడు ఉదయం 11.45 గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు – ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన – మాజీ ప్రధానికి సీఎం చంద్రబాబు, రేవంత్, స్టాలిన్, అతిశీ నివాళులు – మన్నోహన్ సంస్కరణలే భారత్‌ను నిలబెట్టాయి – సీఎం చంద్రబాబు.
  3. ఆలయం నమూనాలో అమరావతి బిట్స్ – సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 35 ఎకరాలు – తితిదే ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు – లా యూనివర్శిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు – సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియాలకు విడిగా స్థలాలు
  4. సీఎస్‌గా విజయానంద్, సాయిప్రసాద్‌లలో ఒకరికి ఛాన్స్ – నెలాఖరున నీరబ్‌కుమార్ పదవీ విరమణ
  5. గాలివీడు ఎంపీడీఓపై వైకాపా నేత దాడి – ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని చంపేస్తామని హెచ్చరికలు – మాకే ఎదురు చెబతావా అంటూ కార్యాలయంలో వీరంగం – వైకాపా లీగల్ సెల్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి అరెస్టు.
  6. పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు – ఐదేళ్ల వైకాపా హయాంలో సహకార రంగానికి చెదలు – సహకార వ్యవస్థ ప్రక్షాళన తర్వాతే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం?
  7. బుగ్గన ఇలాకానా..మజాకా – రెండు ప్రైవేటు గోదాముల్లో బియ్యం అక్రమ తరలింపు
  8. దల్లేవాల్ కు వైద్య సహాయం అందించండి – శాంతిభద్రతల సమస్య ఎదురైతే అడ్డుకోండి – పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీకోర్టు ఆదేశం
  9. నదుల అనుసంధానం దిశగా అడుగులు – ప్రాధాన్యంగా ఎంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం – జాతీయ జల అభివృద్ధి సంస్థకు ఏపీ లేఖ – గోదావరి బనకచర్లపై వ్యాప్కోస్ తో చర్చలు
  10. తెలుగుతల్లితో తెగని పేగుబంధం – పరాయిగడ్డ పైనా మాతృభాషకు ఊపిరులు – సుదీర్ఘ పోరాటంతో బెంగాల్లో అధికారికంగా గుర్తింపు – మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు – తమిళనాడులో తీవ్ర అణచివేతపై ఉద్యమబాటా

 

ఆంధ్రజ్యోతి

  1. నాడు షాకులు...నేడు శోకాలు – విద్యుత్ చార్జీల బాదుడు జగన్‌దే –సర్దుబాటు పేరుతో వరుసగా పోట్లు – అధికారంలో ఉండగా రకరకాలుగా దెబ్బలు – చివరి రెండేళ్లలో 20 వేల కోట్లకు పైగా బాదుడు – ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం – అప్పుడు నిర్ణయం పెండింలో పెట్టిన ఈఆర్‌సీ – కూటమి సర్కారు వచ్చాక ఆమోదం.
  2. మెగా డీఎస్సీ ఇంకెప్పుడు? – బడులు తెరిచేనాటికి కొత్త టీచర్లు కొలువుదీరేనా? – అభ్యర్ధుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా – తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత – డీఎస్సీ ప్రకటించాక భర్తీకి కనీసం మూడు నెలలు –తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం – మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమని వాదన
  3. దళిత ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి – గొంతు మీద కాలేసి..పిడిగుద్దులు – అన్నమయ్య జిల్లా గాలివీడులో దౌర్జన్యకాండ – కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన వైనం
  4. గనుల్లో తిమింగలం తిష్ట – తీవ్ర ఆరోపణలున్నా ఇంకా అక్కడే – గనుల వెంకటరెడ్డి కంటే ఘనుడు – సెలవుపై పంపడానికి గనుల శాఖ యత్నం – ససేమిరా అంటున్న ఇద్దరు అమాత్యులు – గతంలో రెండుసార్లుద పైరవీలు – తాజాగా సీఎంవో నుంచి వచ్చిన జాబితాలోనూ ఆయనదే తొలిపేరు – ఇప్పుడు కూడా పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు.
  5. వాహన స్కామ్‌పై విజిలెన్స్ – కార్లు, ఈ-ఆటోల కొనుగోలుకు రూ.వందల కోట్లు ఖర్చు – వాహన డీలర్లతో ఎస్సీ కార్పరేషన్ అధికారులు కుమ్మక్కు – రూ.93.98 కోట్లు స్వాహా చేసి దళిత యువతకు ద్రోహం – జగన్ భజన చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారే కీలక లబ్దిదారు
  6. పోలవరం నిర్మాణ బాధ్యత చేపట్టాలని రాష్ట్రాన్ని కేంద్రమే కోరింది – ఆర్ధిక శాఖ 2016 లో లేఖ రాసింది – సత్వర లబ్ది కోసం 41.15 మీటర్ల ఎత్తున తొలిదశలో పూర్తికి ఏపీ ప్రతిపాదన – ఆర్‌టీఐ ప్రశ్నకు జలశక్తి శాఖ జవాబు
  7. సవరించిన అంచనాలు..ఆమోదం నేడు – నేడు ఉమ్మడి జిల్లా జేసీలతో సబ్‌రిజిస్ట్రార్ల భేటీ – జిల్లా స్థాయి కమిటీలలో సవరించిన భూముల ధరలకు ఆమోదం – గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 12 శాతం మేర విలువ పెంపు ప్రతిపాదన – ఎల్‌పీఎం నెంబర్లపై ప్రత్యేక ఆదేశాలు

 

ఇంకా చదవండి: ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

సాక్షి

  1. ఎగిసిపడ్డ ప్రజాగ్రహం – చంద్రబాబు సర్కారు బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై సరవ్త్రా మండిపాటు – పెంచిన కరెంట్ చార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే – ఇప్పటికే మోపిన రూ.6,072 కోట్ల చార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి – జనవరి నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడును రద్దు చేయాలి – ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పునరుద్దరించాలి.
  2. దారి పొడవునా బ్రహ్మరథం –వైఎస్సార్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన – అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనం –మార్గం మధ్యలో రోడ్డుపైకి తరలి వచ్చిన అభిమాన జనం – అందరినీ పలకరిస్తూ, సెల్పీలు దిగుతూ ముందుకు సాగిన జననేత – కూటమి సర్కారు బాధితులకు అండగా ఉంటామని భరోసా
  3. శ్రీశైలం జలాశయం ఖాళీ – 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిన నీటి నిల్వ – ఎడమ కేంద్రంలో యదేచ్ఛగా తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి – దిగువన నీటి అవసరాలు లేకున్నా 35,315 క్యూసెక్కులు తరలింపు –కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కిన తెలంగాణ జెన్‌కో – అయినా నోరు మెదపని ఏపీ ప్రభుత్వం
  4. అబద్దాలతో మోసంగించే నైజం చంద్రబాబుది – విద్యుత్ చార్జీలు పెంచనని పది సభల్లో బాబు హామీ ఇచ్చారు – అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలు పెంచాడు – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
  5. టిడిపి రౌడీల దౌర్జన్యకాండ – అనంతపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో పేట్రేగిపోయిన మూకలు – కాకినాడ జిల్లా మందసంలో వైఎస్సార్‌సీపీ నేతపై కత్తులతో దాడి..పరిస్థితి విషమం – పల్నాడు జిల్లాలో మరో నేత ఇంటిపై దాడికి యత్నం – అడ్డుకోబోయిన ఆయన తల్లి తలకు తీవ్రగాయం – కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ స్కార్పియో వాహనానికి నిప్పు.

 

ఆంధ్రప్రభ

  1. పాలన ఇక కొత్త పుంతలు..కొత్త ఏడాదిలో నవపాలన – భారీ మార్పులకు సీఎం శ్రీకారం –నెలాఖరులో సీఎస్ నీరబ్ కుమార్ పదవీ విరమణ – ఆ తర్వాత మరో పది మంది ఐఏఎస్‌లు రిటైర్మెంట్ – కేంద్ర నిధుల పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌లు, మంత్రులతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు యోచన
  2. అప్పులు రూ.5.62 లక్షల కోట్లు – ఏటా వడ్డీలకే రూ.28 వేల కోట్లు – రాష్ట్ర ఖజానాపై పెను ఆర్ధిక భారం – నెలకు రూ.2,400 కోట్లు వడ్డీ చెల్లింపు – ప్రతినెలా వడ్డీ చెల్లించపోతే కొత్త రుణాలపై ప్రతికూల ప్రభావం
  3. రూపాయి పాపాయి పడిపోయింది – చరిత్రలోనే కనిష్ట స్థాయికి పతనం – ఏడేళ్లుగా దిగజారుతున్న డాలతో మారకం విలువ – ఇంట్రాడేలో రూ.85.80 కి పతనం – చివరకు రూ.85.50 వద్ద స్థిరం – దిగుమతిదారుల డిమాండ్, పెరుగుతున్న క్రూడ్ ధరలే కారణం

 

ప్రజాశక్తి

  1. చేసిన తప్పును అంగీకరించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు – సిడబ్యుసీ సమావేశాలను ప్రారంభించిన ఖర్గే
  2. ఉద్యోగార్ధులపై విరిగిన లాఠీ – బీహార్ లో పోలీసుల దాష్టీకం – పరీక్షా పత్రం లీక్‌పై ప్రశ్నించడమే నేరమా? – లాలూ, రాహుల్, తేజస్వీ తదితరుల ఖండన
  3. సమ్మె ఒప్పందాలు అమలు చేయాల్సిందే – పలుచోట్ల మున్సిపల్ కార్మికుల ధర్నాలు

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

విశాలాంధ్ర

  1. భూముల ధరల పెంపుపై ప్రభుత్వం వెనకడుగు – రూ.14 వేల కోట్ల ఆదాయం లక్ష్యం – ప్రజల నుంచి వ్యతిరేకత – పునరాలోచనలో కూటమి సర్కారు
  2. నూతన సీఎస్ సాయిప్రసాద్ – రేసులో విజయానంద్, సిసోడియా – డీజీపీ నియామకంపై కొనసాగుతున్న కసరత్తు – తిరుమలరావును పొడిగించని పక్షంలో గుప్తాకు అవకాశం
  3. అమరావతి రైల్వే పనుల్లో కదలిక – భూసేకరణకు నోటిఫికేషన్ జారీ – 16 వ తేదీలోగా అభ్యంతరాలు తెలపాలని వినతి

 

దిశ

  1. స్కిల్.. స్పీడ్ - మంత్రి లోకేశ్ చొరవతో వేగవంతమైన స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ - యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి చర్యలు - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు - పారిశ్రామిక అవసరాల మేరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు - గ్రామీణ యువత ఉపాధి కోసం సెంచూరియన్ వర్సిటీతో ఒప్పందం
  2. చావకముందే చంపేస్తున్నారు ! - తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ - పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ - పేరెంట్స్ ను పట్టించుకోని సుపుత్రులు -మలిసంధ్యలో బతుకులు ఆగం - బుక్కెడు బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు - అందరూ ఉన్నా అనాథలుగా జీవితం
  3. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు..! - మేమెలా ఇస్తాం ? ఎందుకిస్తాం ? - పార్లమెంటులో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకున్నా ఎంపీలను ఎలా పంపుతున్నారు - అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం జగన్ కు లేదు - మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు
  4. డబ్బు కోసం కాదు.. ప్రెస్టీజ్ కోసమే - సిమెంట్ కంపెనీ వివాదంపై సారీ చెప్పిన జేసీ - తన పొగరుతో చాలా నష్టపోయానని వెల్లడి
  5. పక్కా ప్లాన్.. రివర్సయింది - వీడిన డెడ్ బాడీ పార్సిల్ మిస్టరీ - నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు - కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అద్నాన్ నయీం
  6. ఎంపీ సార్.. హెల్మెట్ ఎక్కడ ? - కాకినాడ ఎంపీ శ్రీనివాస్ బైక్ రైడింగ్ వీడియో వైరల్ - ట్రాఫిక్ ను ఆపడం, హెల్మెట్ ధరించకపోవడంపై విమర్శలు
  7. హోంమంత్రి ఇలాకాలో మెగా జాబ్ మేళా - 1000కి పైగా ఉద్యోగాలిచ్చేందుకు తరలివస్తున్న టాప్-50 కంపెనీలు - పాయకరావుపేటలో జరిగే మేళాకు భారీగా రిజిస్టేషన్
  8. బిర్యానీ.. బ్రేవ్..! - వరుసగా తొమ్మిదో ఏడాదీ ఈ వంటకానిదే అగ్రస్థానం - ఈ ఏడాది 9 కోట్ల బిర్యానీలు ఆర్డర్ - జొమాటో వర్షిక నివేదికలో వెల్లడి

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews