సంక్రాంతికి ఉర్లువెల్లే వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ అధిరిపోయే శుభవార్త! వేల బస్సులతో ప్రయాణం...!

Header Banner

సంక్రాంతికి ఉర్లువెల్లే వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ అధిరిపోయే శుభవార్త! వేల బస్సులతో ప్రయాణం...!

  Sat Dec 28, 2024 14:28        Others

ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారి కోసం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అయింది. 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. రెగ్యులర్ బస్సులకు ఇవి అదనమని.. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవని రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో రద్దీని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కొన్ని మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్ బస్సుల్ని ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్, గౌలిగోడ నుంచి నడిపించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #apsrtc #freebus #pongal #goodnews #todaynews #flashnews #latestupdate