వైకాపా నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదు! నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు!

Header Banner

వైకాపా నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదు! నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు!

  Sat Dec 28, 2024 21:44        Politics

మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. "తప్పు చేయనప్పుడు పెనాల్టీ మొత్తం ఎందుకు కట్టారు? పేర్ని నాని తన పేరు మీద గోడౌన్ లీజుకు తీసుకోకుండా.. భార్య పేరుతో ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి పేరున గిడ్డంగి ఉంటే వారి మీదే కేసులు నమోదవుతాయి. రేషన్ బియ్యం తగ్గుదల గుర్తించి... పెనాల్టీ కడతామని ముందుగానే లేఖ రాసిందెవరు? ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది. వ్యవస్థలను దుర్వినియోగం చేసి స్వార్థం కోసం పనిచేశారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



రాష్ట్రంలోని అన్ని గిడ్డంగుల్లో తనిఖీలు చేయమని నవంబరు 26న ఆదేశించాం. ఆ మరుసటి రోజే జయసుధ తప్పు అంగీకరించి లేఖ రాస్తే.. 378 మెట్రిక్ టన్నుల బియ్యానికి రూ.1.70 కోట్లు కట్టమంటే కట్టారు. తర్వాత నోటీసులకు పేర్ని నాని స్పందించలేదు. 378 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడకు వెళ్లాయో తేలాలి కదా. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే అవసరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు లేదు" అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయిన 21 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందజేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #perninani #exminister #rice #scam #todaynews #flashnews #latestupdate