స్పోర్ట్స్ షూస్ తెచ్చిన తిప్పలు! ఆ కంపెనీకి రు. 32 లక్షలు లాస్! అసలు కథ ఎంతంటే!

Header Banner

స్పోర్ట్స్ షూస్ తెచ్చిన తిప్పలు! ఆ కంపెనీకి రు. 32 లక్షలు లాస్! అసలు కథ ఎంతంటే!

  Sat Dec 28, 2024 15:42        Europe

ప్రైవేటు ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. మనకు నచ్చకపోయినా, కంపెనీకి నచ్చకపోయినా.. ఉద్యోగం పోయేది మనదే. ఇది అందరు ప్రైవేటు ఉద్యోగులకు తెలిసిందే. అయితే కొన్ని కంపెనీల్లో ఉండే రూల్స్ అండ్ కండీషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా గీత దాటితే మాత్రం వేటు తప్పదు. ఇక ఒక యువతికి మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఆ యువతి నిబంధనలు పాటించడం లేదంటూ సదరు కంపెనీ ఆమె ఉద్యోగాన్ని ఊడగొట్టింది. దీంతో షాక్ అయిన ఆ యువతి.. ఉద్యోగ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఆమెకు అక్కడ న్యాయం దొరికింది. ఆమెను ఉద్యోగం నుంచి అకారణంగా తీసేశారని గుర్తించిన ఉద్యోగ ట్రిబ్యునల్ ఆ యువతికి పరిహారం అందించాలని కంపెనీని ఆదేశించింది. 

 

లండన్‍లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్‌లో డ్రెస్ కోడ్‌ పాటించలేదని ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనలో ఓ కంపెనీకే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగం నుంచి ఆమెను అవసరంగా తొలగించాలని గుర్తించిన ఉద్యోగ ట్రిబ్యునల్.. ఆమెకు పరిహారంగా 30 వేల పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.32.20 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఎలిజబెత్‌ బెనాస్సీ అనే 18 ఏళ్ల యువతి 2022లో లండన్‌లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్‌లో ఒక ఉద్యోగానికి ఎంపికైంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే ఆమె ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఆమె డ్రెస్ కోడ్ పాటించకుండా.. ఆఫీస్‌కు స్పోర్ట్స్‌ షూ వేసుకు వచ్చిందని గుర్తించిన యాజమాన్యం.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆమె ఉద్యోగ ట్రిబ్యునల్‌కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. అయితే ఆ కంపెనీకి డ్రెస్ కోడ్‌ ఉందని తనకు సమాచారం తెలియదని సదరు యువతి పేర్కొంది. అంతేకాకుండా తెలియకుండా తాను స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీస్‌కు వెళ్లినందుకు అందులోని ఓ మేనేజర్‌ తనను తీవ్రంగా అవమానించారని తెలిపింది. 

 

అయితే ఎలిజబెత్ బెనాస్సీ చేసిన ఆరోపణలను సదరు కంపెనీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము నిబంధనలను అతిక్రమించి ఎలాంటి తప్పు చేయలేదని ఆ కంపెనీ పేర్కొంది. ఇరువైపులా వాదనలు విన్న ఉద్యోగ ట్రైబ్యునల్‌ ఎలిజబెత్‌ బెనాస్సీకే మద్దతుగా తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే అకారణంగా ఉద్యోగం తొలగించినందుకు.. ఆమెకు రూ.32 లక్షలు పరిహారం ఇవ్వాలని తెలిపింది. అయితే ఆ యువతి ఉద్యోగానికి కొత్త అని.. డ్రెస్ కోడ్‌ గురించి ఆమెకు పూర్తిగా తెలియకపోవచ్చని పేర్కొంది. అది పొరపాటుగా భావించి.. ఆమెకు మరో అవకాశం ఇవ్వకుండా అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేయడం తప్పు అని ఉద్యోగ ట్రైబ్యునల్‌ వెల్లడించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

  

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKElections #UKUpdates