అమెరికాలో హెచ్1బీ వీసాల చిచ్చు! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Header Banner

అమెరికాలో హెచ్1బీ వీసాల చిచ్చు! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

  Sun Dec 29, 2024 19:28        U S A

భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు.. అక్కడి ప్రభుత్వం జారీ చేసే హెచ్ 1బీ వీసాల విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లిక్ పార్టీలోనే హెచ్ 1బీ వీసాల అంశంపై రెండు వర్గాలుగా చీలిపోయి.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో హెచ్‌1 బీ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే నేతలు, ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ హెచ్ 1బీ వీసీల విషయంపై నేరుగా డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. తాను ఎప్పుడైనా హెచ్ 1బీ వీసాలకు అనుకూలమేనని తేల్చి చెప్పారు. 

 

టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్, భారత అమెరికన్ వివేక్ రామస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు.. హెచ్ 1బీ వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు మద్దతును ఇవ్వగా.. పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇవి అక్రమమని.. అమెరికా ఫస్ట్ నినాదానికి వ్యతిరేకం అని వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ తాను హెచ్‌1 బీ వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందు కోసమే అమెరికాలో ఆ హెచ్ 1బీ వీసాలు ఉన్నాయని తెలిపారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ-డోజ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ డోజ్‌కు సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్‌, వివేక్‌ రామస్వామి ఈ హెచ్ 1బీ వీసాలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గ్రాడ్యుయేట్‌లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని.. అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి హెచ్‌ 1బీ వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ హెచ్ 1బీ వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఎలాన్ మస్క్‌ కూడా హెచ్‌ 1బీ వీసా పైనే అమెరికాకు వలస రావడం గమనార్హం.

 

ఇక హెచ్ 1బీ వీసాల విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. తాను సౌత్‌ కరోలినా గవర్నర్‌గా ఉన్నపుడు నిరుద్యోగిత రేటు 11 శాతం నుంచి 4 శాతానికి తగ్గినట్లు చెప్పారు. విదేశాల నుంచి ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించడం వల్లే.. నిరుద్యోగాన్ని తగ్గించినట్లు తెలిపారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్‌ తయారీలో రాణిస్తున్నారని వెల్లడించారు. అంతేగానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు.

 

నైపుణ్యం కలిగిన విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అమెరికా కంపెనీలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న జో బైడెన్‌ కార్యవర్గం ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు సులువుగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్‌-1బీ వీసాలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో లక్షలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఈ వీసా నాన్‌ ఇమిగ్రెంట్‌ కేటగిరీలోకి వస్తుంది. అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను ఈ నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీ వీసాల సాయంతో విదేశీయులను నియమించుకుంటాయి. మరీ ముఖ్యంగా భారత్‌, చైనా ప్రజలకు భారీగా లబ్ధి కలుగుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

  

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants