చీలిపోతున్న ఆఫ్రికా ఖండం! త్వరలో మరో మహా సముద్రం ఆవిర్భావం!

Header Banner

చీలిపోతున్న ఆఫ్రికా ఖండం! త్వరలో మరో మహా సముద్రం ఆవిర్భావం!

  Wed Jan 01, 2025 14:05        World

భూగోళ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు సంభవిస్తున్నాయి. టెక్టానిక్‌ ప్లేట్ల కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో సముద్రం ఏర్పడబోతున్నది. రానున్న కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ జరిగి భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం భూగోళంలో దాదాపు మూడొంతుల భాగం నీటితో కప్పబడి ఉన్న విషయం తెలిసిందే. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది అట్లాంటిక్‌, పసిఫిక్‌, హిందూ, ఆర్కిటిక్‌, దక్షిణ మహా సముద్రాలుగా విభజితమై ఉన్నది. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్‌ వరకు విస్తరించి ఉన్న గ్రేట్‌ రిఫ్ట్‌ వ్యాలీ ప్రాంతంలో భూగోళ అంతర్గత శక్తుల ప్రభావం వల్ల నుబియన్‌ టెక్టానిక్‌ ప్లేట్‌ నుంచి సోమాలి టెక్టానిక్‌ ప్లేట్‌ విడిపోతున్నదని, దీంతో ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ హిందూ మహా సముద్రం నీటితో కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటంతో ఆఫ్రికా ఖండం చీలిపోయే ప్రక్రియ కొనసాగుతున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #World #Africa