మరో రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదాలు..! ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో...!

Header Banner

మరో రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదాలు..! ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో...!

  Sun Dec 29, 2024 20:11        Others

దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ ఎయిర్పోర్టులో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోగా.. కొన్ని గంటల తేడాతో మరో రెండు విమానాలు వేర్వేరు దేశాల్లో అలాంటి ప్రమాదాలనే తప్పించుకున్నాయి. ఎయిర్ కెనడాకు చెందిన విమానానికి శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. హాలిఫాక్స్ ఎయిర్పోర్టులో ఎయిర్ కెనడాకు చెందిన AC2259 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.

ఆ సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్వేపై ఓ పక్కకు జారిపోయి మంటలు వచ్చాయి. ఈ విమానం కెనడాలోని సెయింట్ జోన్స్ నుంచి హాలిఫాక్స్కు ప్రయాణిస్తోంది. ఇది డాష్ 8-400 రకం విమానంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో దాని రెక్కలు పూర్తిగా రన్వేకు రాసుకుపోయాయి. ఆ సమయంలో మంటలు వచ్చినట్లు ప్రయాణికులు తీసిన వీడియో దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఇది చోటు చేసుకొంది.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



నార్వేలో కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్..

రాయల్ డచ్కు చెందిన విమానం ఒకటి నార్వేలోని టోర్ప్ ఎయిర్పోర్టులో రన్వేపై అదుపు తప్పింది. బోయింగ్ 737-800శ్రేణికి చెందిన విమానం ఇది. ఓస్లో ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకొన్న వెంటనే.. హైడ్రాలిక్ ఫెయిల్యూర్ చోటుచేసుకొంది. దీంతో 110 కిలోమీటర్ల దూరంలోని టోర్ప్ ఎయిర్ పోర్టుకు దీనిని మళ్లించారు. ఇది సురక్షితంగా నేలపైకి దిగినా.. రన్వే పై మాత్రం అదుపుతప్పింది. ఈ విషయాన్ని ఏవియేషన్ 24 సంస్థ పేర్కొంది. కాకపోతే ఇది సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారు. ప్రయాణికులను అత్యవసరంగా విమానం నుంచి దించేశారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసి సహాయక చర్యలు చేపట్టారు. బోయింగ్ 737-800 శ్రేణి విమానమే దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురైంది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #korea #filght #accident #norway #todaynews #flashnews #latestupdate