ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు! కీలక ప్రాజెక్టులకు..
Sun Jan 05, 2025 17:50 Politicsప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ విశాఖలో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను లోకేశ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనల కోసమే ప్రధాని విశాఖకు వస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ తన పర్యటనలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, రూ.70 వేల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, విశాఖ-చెన్నై ఎకనామిక్ కారిడార్ లో కృష్ణపట్నం వద్ద కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన... రూ.3,900 కోట్లతో పూర్తయిన రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారని లోకేశ్ వివరించారు. ముఖ్యమైనది, మనందరి కల విశాఖ రైల్వేజోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదని, దాంతో రైల్వే జోన్ ఆలస్యమైందని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూమిని కేటాయించడంతో, రైల్వే జోన్ భవన నిర్మాణాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని లోకేశ్ వివరించారు.
ఇంకా చదవండి: ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!
ఇదేకాకుండా, పలు రైల్వే అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలుకుతామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని... గత వైసీపీ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రభుత్వం అని విమర్శించారు. గత సర్కారు ఉత్తరాంధ్ర యువతకు ఎలాంటి ఉపాధి చూపించలేదని అన్నారు. అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ను విశాఖకు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇక్కడి ఎయిర్ పోర్టుకు భూసేకరణ చేసిన ఘనత కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఒక్క వ్యక్తి కోసం రూ.1000 కోట్లు వృథా చేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న కంపెనీలన్నింటినీ తరిమేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గూగుల్, టీసీఎస్ వంటి కంపెనీలు ఏపీకి వస్తున్నాయని వివరించారు. వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ 80 శాతం మంది వాలంటీర్లతో జగన్ రాజీనామా చేయించారని వెల్లడించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?
పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!
రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.