ఓరి దేవుడా.. ఏంటి నిజమా.. ఈ 5 ఐటెమ్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా? అయితే మీ శరీరంలోకి స్లోగా పాయిజన్ వెళ్తున్నట్లే..

Header Banner

ఓరి దేవుడా.. ఏంటి నిజమా.. ఈ 5 ఐటెమ్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా? అయితే మీ శరీరంలోకి స్లోగా పాయిజన్ వెళ్తున్నట్లే..

  Tue Jan 07, 2025 10:00        Health

ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి పూర్వ కాలంలో కొన్ని రకాల స్టోరేజ్ పద్ధతులను ఉపయోగించేవారు. కానీ, ఈ రోజుల్లో ఫుడ్ ఐటెమ్స్‌ స్టోర్ చేయడానికి ఫ్రిజ్‌లను వాడుతున్నారు. ఏ ఆహార పదార్థమైనా సరే, దాన్ని ఫ్రిజ్‌లలోనే స్టోర్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లో పెట్టే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహారాలు పాడవకుండా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయితే చాలా మంది ఏది పడితే అది ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. ఈ అలవాటు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 ఫుడ్ ఐటెమ్స్‌ అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తే, అవి విషంలా మారతాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం. అన్నం.. రాత్రి తినగా మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం చాలా మందికి అలవాటు. అయితే, ఇలా రైస్‌ను 24 గంటలకు మించి స్టోర్ చేస్తే, అది విషంగా మారే ప్రమాదం ఉంది.

 

ఇంకా చదవండి: మద్యపానంతో క్యాన్సర్‌ ముప్పు! ఎంత తాగినా ఆరోగ్యానికి నష్టం తప్పదు!

 

ముఖ్యంగా, ఒకసారి ఫ్రిజ్‌లో పెట్టిన అన్నంను నేరుగా తినకూడదు. దాన్ని పూర్తిగా వేడిచేసి తినాలి. సగం సగం వేడి చేసినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ అలవాటును మానుకోవాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. వెల్లుల్లి.. వెల్లుల్లిని ఉష్ణోగ్రత తక్కువగా ఉండే చోట స్టోర్ చేసుకోవాలని చెబుతుంటారు. దీంతో పొరబడి చాలా మంది వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేస్తే అనారోగ్య ముప్పును కొని తెచ్చుకున్నట్లే. వెల్లుల్లిని నేరుగా స్టోర్ చేయడం, పొట్టు తీసి పెట్టడం.. రెండూ డేంజరే. వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగే ఫ్రిజ్‌లో పెడితే చల్లటి వాతావరణానికి బూజు పడుతుంది. ఈ బూజు క్యాన్సర్ రిస్క్‌ని పెంచుతుంది. ఒకవేళ పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలను ఫ్రిజ్‌లో పెట్టినా లేదా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌ను స్టోర్ చేసినా దాని ఫ్లేవర్ పోతుంది. దీంతోపాటు వెల్లుల్లి ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి, వీటిని బయట పెట్టడమే మంచిది. 

 

ఇంకా చదవండి: హార్ట్ ఎటాక్ వ‌చ్చే 30 రోజుల ముందు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి! జాగ్ర‌త్త ప‌డండి!

 

అల్లం.. తాజాగా ఉండటానికి చాలా మంది దానిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ముఖ్యంగా, అల్లం పేస్ట్‌ను ఇలా స్టోర్ చేస్తుంటారు. అయితే అల్లం కొమ్ములను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దానిపై బూజు వృద్ధి చెందుతుంది. దీనిని తింటే కిడ్నీలు, కాలేయంపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో పచ్చి అల్లాన్ని నేరుగా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఉల్లిపాయ.. ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌లో అస్సలు స్టోర్ చేయకూడదు. ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో వీటిలోని స్టార్చ్ షుగర్‌గా మారుతుంది. ఫలితంగా, బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది. వీటిని వంటల్లో వాడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉల్లిపాయలను పొడి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో స్టోర్ చేయాలి. బ్రెడ్ బ్రెడ్‌కు ఫిక్స్‌డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. దాన్ని ఆ గడువు తేదీలోపే తినాలి. ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడితే, తేమ కారణంగా వాటిపై బూజు ఏర్పడి, త్వరగా పాడైపోవచ్చు. ఇవి పాటించాలి.. ఫ్రిజ్‌లో ఏదైనా ఫుడ్స్ స్టోర్ చేసేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి లీకేజీలు లేకుండా, కంటెయినర్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వండిన ఆహారాన్ని వేడి మీద ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాతే స్టోర్ చేయాలి. లేదంటే, వాటి స్వభావం మారే అవకాశం ఉంది.  

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

నేడు (6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

AP: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Refrigerator #Tips #HealthCare