13 ఏళ్ల తర్వాత! సిరియా రాజధానిలో ల్యాండ్‌ అయిన తొలి ఖతారీ ఫ్లైట్‌!

Header Banner

13 ఏళ్ల తర్వాత! సిరియా రాజధానిలో ల్యాండ్‌ అయిన తొలి ఖతారీ ఫ్లైట్‌!

  Tue Jan 07, 2025 20:02        Qatar

దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్‌ కు చెందిన విమానం సిరియా రాజధాని డమాస్కస్‌ లో ల్యాండ్‌ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖతారీ ఫ్లైట్‌ డమాస్కస్‌లో ల్యాండ్‌ అయ్యిందని AFP ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఉదయం ఖతార్‌లోని దోహా నుంచి బయలుదేరిన వాణిజ్య విమానం మధ్యాహ్నానికి డమాస్కస్‌కు చేరుకుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ నియంత పాలన కారణంగా దాదాపు 14 ఏళ్లుగా అంతర్యుద్ధం కొనసాగింది. దాంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై అక్కడ నిషేధం విధించారు. నెల రోజుల క్రితం తిరుగుబాటుదారులు బషర్‌ అల్‌ అసద్‌ను తరిమికొట్టడంతో తాజాగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. దాంతో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్‌ ఫ్లైట్‌ సిరియాలో దిగింది. అంతకుముందు డమాస్కస్‌ విమానాశ్రయం నుంచి ఓ విమానం సౌదీ అరేబియాలోని షార్జాకు వెళ్లింది. అది సిరియా నుంచి బయటి దేశానికి వెళ్లిన తొలి విమానం. ఆ విమానం బయలుదేరి వెళ్లిన కొన్ని గంటలకే ఖతార్‌ విమానం డమాస్కస్‌లో ల్యాండ్‌ అయ్యింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Qatar #QatarNews #Gulf #GulfNews #GulfCountries #GulfUpdates #QatarUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrant