కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన! వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన.. టాటా సంస్థ సహకారంతో..

Header Banner

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన! వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన.. టాటా సంస్థ సహకారంతో..

  Tue Jan 07, 2025 19:48        Politics

సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన నేడు రెండో రోజు కూడా కొనసాగింది. కుప్పంలో పలు నిర్మాణ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మదర్ డెయిరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాల భూమిపూజలో పాల్గొన్నారు. కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన 'స్వర్ణ కుప్పం' సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... రానున్న 23 ఏళ్లలో కుప్పం భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంలా ఉండాలని అన్నారు. ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరుకు వెళ్లడం కాదు, కుప్పానికి రావాలి... అలాంటి విద్యాసంస్థలను ఇక్కడికి తీసుకువస్తామని వివరించారు. ఇవన్నీ కాకుండా, అత్యంత నివాసయోగ్యమైన ప్రదేశంగా కుప్పంను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కుప్పానికి వచ్చే ప్రజలకు ఆరోగ్యం పెరగాలి... సాధారణంగా బెంగళూరు కంటే కుప్పం వచ్చే వాళ్లకు 20-30 ఏళ్లు ఎక్కువగా ఆయుష్షు పెరిగే పరిస్థితి వస్తే... అప్పుడందరూ వెతుక్కుంటూ కుప్పానికి వస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

ఇంకా చదవండి: తిరుమలలో భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే! HMPV వైరస్‌పై టీటీడీ కీలక ప్రకటన!

 

అంత పరిశుభ్రమైన ప్రాంతంగా కుప్పంను తయారు చేస్తాం అని స్పష్టం చేశారు. అందుకు మీ అందరి సహకారం అవసరం అని అన్నారు. అంతేగాకుండా, కుప్పంను ఒక టూరిస్ట్ హబ్ గా మార్చుతామని, వీకెండ్ లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేలా చేస్తామని చెప్పారు. ఇక, నిడమూరులో ఇళ్లపై సోలార్ కరెంటు ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం బాగా విస్తరించాల్సిన అవసరం ఉందని, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు. మైక్రో కిరాణా దుకాణాల యజమానులకు లాభాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో అందరికీ అధునాతన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews