భారీ వర్షాలతో నీటమునిగిన సౌదీ అరేబియా! హెచ్చరికలు జారీ!

Header Banner

భారీ వర్షాలతో నీటమునిగిన సౌదీ అరేబియా! హెచ్చరికలు జారీ!

  Tue Jan 07, 2025 22:15        Gulf News

సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. మక్కా, మదీనా, జెడ్డా, గవర్నరేట్‌లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో భారీగా నష్టం వాటిల్లింది. బుధవారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం, వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ముస్లింలకు పవిత్రమైన ప్రార్థనా స్థలాలు. ప్రతి సంవత్సరం హజ్‌, ఉమ్రా యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఆయా నగరాలకు చేరుకుంటారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రస్తుతం భారీ వర్షాలు సౌదీ అరేబియా వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. భారీ వర్షాల కారణంగా సౌదీలోని పలు నగరాలు నీట మునిగాయి. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ వాతావరణ కేంద్రం ఈ వారంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, తుఫానులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షం కురిసేందుకు అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పరిపాలన హెచ్చరికలు చేసింది. ఎలాంటి ఘటన జరిగినా స్పందించేందుకు అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇక రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సూచనలు పాటించాలని నిపుణులు సూచించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants