విజయవాడ హైవేపై గంజాయి ముఠా గుట్టరట్టు! 70 కిలోల గంజాయి స్వాధీనం!

Header Banner

విజయవాడ హైవేపై గంజాయి ముఠా గుట్టరట్టు! 70 కిలోల గంజాయి స్వాధీనం!

  Tue Jan 07, 2025 19:07        Others

విజయవాడ.. హైదరాబాద్ హైవే.. వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది.. వేలాది వాహనాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. అయితే.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ కారు రయ్యిరయ్యిన దూసుకువస్తోంది.. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపేందుకు ప్రయత్నించారు.. కానీ.. కారు మాత్రం ఆగలేదు.. అదే స్పీడుతో డ్రైవర్ వెనుకకు తిప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది.. కారు ఆగకుండా దూసుకెళుతుండటంతో పోలీసులు.. కూడా తమ వాహనాలతో వెంబడించారు.. చివరకు కారు ఓ ఊరిలోకి ప్రవేశించింది.. దానిలో ఉన్న వ్యక్తులు.. నివాస ప్రాంతాల్లో కారును వదిలేసి పారిపోయారు.. కారు దగ్గరకు వెళ్లిన పోలీసులు.. దానిలో ఏముందా అని చెక్ చేశారు.. డిక్కిని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాకయ్యారు.. కారులోంచి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన NTR జిల్లా జగ్గయ్యపేట పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.



ఇంకా చదవండిప్రపంచంలోని టాప్ 10 చిన్న అంతర్జాతీయ విమాన మార్గాలు! అన్నీ 100 కిలోమీటర్ల లోపే!



విజయవాడ హైదరాబాద్ హైవే పై కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా గౌరవరం వద్ద నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు.. ఈ క్రమంలో పోలీసులను చూసి కారు డ్రైవర్ ఆకస్మాత్తుగా కారును ఆపాడు.. అనంతరం గౌరవరం గ్రామంలోకి కారును తిప్పి డ్రైవర్ తప్పించుకోబోయాడు.. దీంతో పోలీసులు ఛేజ్ చేసి కారును పట్టుకున్నారు.. ఈ క్రమంలో కారు వదిలి దుండగులు పరారయ్యారు. అనంతరం కారును పోలీసులు చెక్ చేశారు.. కార్ డిక్కీ తెరచి చూడగా గంజాయ్ పట్టుబడింది.. కారులో పార్సిల్ చేసిన 70 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. గంజాయ్ దందా గురించి ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


నేడు (
6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..


AP: 
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 
నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #vijayawada #highway #drugs #export #todaynews #flashnews #latestupdate