టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

Header Banner

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

  Wed Jan 08, 2025 09:00        India

ఏపీలో మరోసారి లేడీ అఘోరీ ఎంటర్ అయ్యారు. గతంలో రాష్ట్రంలోని పలు దేవాలయాలకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన లేడీ అఘోరీ మరోసారి ఇక్కడికి వచ్చారు. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే జాతీయ రహదారిపై ఉన్న చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద లేడీ అఘోరీ ప్రత్యక్షం కావడంతో ఆమెను చూసేందుకు వాహనదారులు కాసేపు అక్కడే ఆగిపోయారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి పంపేశారు. సంక్రాంతి వేళ ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ఈ రష్ ఇంకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కారులో బయలుదేరిన అఘోరీ చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పోలీసులు ఆమెను అక్కడే ఆపారు. దీంతో పోలీసులపై అఘోరీ చిందులు వేస్తూ కనిపించారు. పోలీసులు ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా లేడీ అఘోరీ శాంతించలేదు. పోలీసులపై ఫోన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆమె సెల్ ఫోన్ ను వారు తీసుకున్నారు. దీంతో లేడీ అఘోరీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 

ఇంకా చదవండి: ఆందోళ‌న క‌లిగిస్తున్న కొత్త వైర‌స్‌! సుర‌క్షితంగా ఉండాలంటే! ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి!

 

కాసేపు ఈ రచ్చ కొనసాగింది. జనం గుమికూడుతుండటంతో పోలీసులు కూడా ఏం చేసేది లేక ఆమెను అక్కడి నుంచి పంపేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీలో ఆలయాలను మరోసారి చుట్టేసేందుకు లేడీ అఘోరీ బయలుదేరారా లేక మరేదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారా అనేది తెలియరాలేదు. లేడీ అఘోరీ గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల హంగామా సృష్టించారు. ఆలయాల్లో నిబంధనలు ఉల్లంఘించి దర్శనాలు చేసుకుంటానని పట్టుబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా వారితో వాగ్వాదాలకు దిగడం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించడం వంటి చర్యలకు దిగారు. అయితే చాలా సార్లు పోలీసులు, అధికారులు ఆమెకు నచ్చజెప్పి దర్శనాలకు అనుమతించడం, ఇతరత్రా ఇబ్బందులు లేకుండా చూశారు. అయినా ఇప్పటికీ అఘోరీ తీరు మారలేదు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #AndhraPradesh #APGovernment #APPolices #APNews #Viralnews