తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి గాలిలో కలిసిపోవటమే! వృద్ధుల రక్షణకు ట్రైబ్యునల్ ఆదేశాలు!

Header Banner

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి గాలిలో కలిసిపోవటమే! వృద్ధుల రక్షణకు ట్రైబ్యునల్ ఆదేశాలు!

  Wed Jan 08, 2025 09:48        Others

తల్లిదండ్రుల చేత ఆస్తుల్ని రాయించుకొని, వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా... వారి పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక... తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని... గిఫ్ట్/ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఆదేశించింది. పిల్లలు నరకం చూపిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. వృద్ధుల అభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చునని... రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ ఎం. శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు కార్డ్ సాఫ్ట్వేర్లో 'పోస్టు రిజిస్ట్రేషన్ ఈవెంట్స్' కింద వివరాల నమోదుకు ఇప్పటికే ఆప్షన్ ఉందని అందులో పేర్కొన్నారు. వృద్ధుల ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్లో నెలకొన్న సందిగ్ధత దృష్ట్యా ఈ ఉత్తర్వులిచ్చారు.



ఇంకా చదవండిఆందోళ‌న క‌లిగిస్తున్న కొత్త వైర‌స్‌! సుర‌క్షితంగా ఉండాలంటే! ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి!



మాట తప్పితే అంతే సంగతులు..
వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి, వారి నుంచి ఆస్తులు పొందిన పిల్లలు ఆ తర్వాత మాట తప్పుతున్నారు. పెద్దలను నడ్డిరోడ్డున పడేస్తున్నారు నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు... తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దు చేసుకునే హక్కును 'తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం-2007' కల్పిస్తుంది. పిల్లలకు బదిలీచేసిన ఆస్తులపై తల్లిదండ్రులకు తిరిగి యాజమాన్య హక్కులు లభించేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసిన సంగతి విదితమే. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చి.. వారి నుంచి ఆస్తిని పొందిన ఓ వ్యక్తి మాటతప్పగా.. అతనికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కులను కోర్టు పునరుద్ధరించింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!


వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత
మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..


దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!


నేడు (
7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు
నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 
24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 
33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 
14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 
బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #parents #oldagehomes #highcourt #order #todaynews #flashnews #latestupdate