ఒక్క ఈ-మెయిల్ తో చంద్రబాబు నా సమస్యను పరిష్కరించారు! ఏపీకి 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు..

Header Banner

ఒక్క ఈ-మెయిల్ తో చంద్రబాబు నా సమస్యను పరిష్కరించారు! ఏపీకి 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు..

  Wed Jan 08, 2025 10:21        Politics

నాలుగు రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ-మెయిల్ చేస్తే రెండు నెలల్లో తన సమస్య పరిష్కారమైందని జాతీయ సైబర్ భద్రతా పరిశోధన కౌన్సిల్ (ఎన్‌సీఎస్ఆర్‌సీ) డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ‘స్వర్ణకుప్పం విజన్-2029’ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన జీతం రూ. 3 వేలని హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకో కష్టం వస్తే కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో చంద్రబాబుకు ఈ-మెయిల్ చేస్తే రెండు నెలల్లోనే సమస్య పరిష్కరించారని తెలిపారు. ‘‘సీఎం ఎట్ ఏపీ జీవోవీ డాట్ ఇన్‌కు ఇటీవల మూడుసార్లు సంప్రదించినా స్పందన రాలేదు.

 

ఇంకా చదవండి: టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

 

ఇప్పుడు ఏపీకి నేను 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తా. మీరు అవకాశం ఇస్తే సైబర్ రంగం ద్వారా ప్రభుత్వానికి రూ. 1000 కోట్ల ఆదాయం తెప్పిస్తా’’ అని హరికృష్ణ పేర్కొన్నారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు తన కార్యదర్శి ప్రద్యుమ్న మీతో మాట్లాడతారని హరికృష్ణకు చెప్పారు. అంతేకాదు, సైబర్ భద్రత సాంకేతిక బృందంలో ఆయనను సలహాదారుగా చేర్చుకుంటామని హామీ ఇచ్చారు. సైబర్ భద్రతలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతానని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగానే కొన్ని అడ్డంకులు ఉంటాయని, అలాంటి సందర్భాల్లో మీలాంటి వ్యక్తులతో మాట్లాడడం కుదరదని, అయితే, ఇకపై ఇలాంటివి లేకుండా చూస్తానని హరికృష్ణకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews