వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

Header Banner

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

  Wed Jan 08, 2025 10:30        Politics

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ కుటుంబంలో విషాదం.. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి మరణంపై వైఎస్సార్‌సీపీ నేతలు సంతపాన్ని తెలియజేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవ దేహాన్ని పులివెందులకు తరలించారు.. అంత్యక్రియలను ఇవాళ నిర్వహిస్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్‌ కూడా పులివెందుకు వెళాతరని చెబుతున్నారు. అభిషేక్ మరణంతో వైఎస్‌ కుటుంబంతోపాటు వైఎస్సార్‌సీపీలోనూ తీవ్ర విషాదం అలుముకుంది.

 

ఇంకా చదవండి: టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

 

వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్‌రెడ్డి. అలాగే అభిషేక్‌రెడ్డి వైద్యవృత్తిలో ఉంటూనే పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్సార్‌సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.. అలాగే పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్రలోనూ అభిషేక్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #YSRCP #Dastagiri #Pulivendula #Nomination