ట్రూడో రాజీనామా కెనడా రాజకీయాల్లో ప్రకంపనలు! ట్రంప్ 51వ రాష్ట్ర కల మళ్లీ తెరపైకి!

Header Banner

ట్రూడో రాజీనామా కెనడా రాజకీయాల్లో ప్రకంపనలు! ట్రంప్ 51వ రాష్ట్ర కల మళ్లీ తెరపైకి!

  Wed Jan 08, 2025 11:04        U S A

కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తాను చేసిన '51వ రాష్ట్రంగా విలీనం’ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా తన గత పదవీకాలం (2017- 21)లోనూ కెనడాతో సత్సంబంధాలు లేని ట్రంప్.. రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికాతో తనకున్న దక్షిణ సరిహద్దు మీదుగా మాదకద్రవ్యాల రవాణా, అక్రమ వలసలను కెనడా ఆపకపోతే సుంకం విధింపు తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇపుడు ట్రూడో రాజీనామా ప్రకటన వెలువడిన నేపథ్యంలో తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ మరోమారు స్పందించారు.


ఇంకా చదవండిఆందోళ‌న క‌లిగిస్తున్న కొత్త వైర‌స్‌! సుర‌క్షితంగా ఉండాలంటే! ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి!



“కెనడాలో మెజారిటీ ప్రజలకు 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం కావడం ఇష్టమే. ఆ దేశంతో భారీ వాణిజ్యలోటును, ఇస్తున్న రాయితీలను అమెరికా ఇక ఎంతోకాలం భరించలేదని జస్టిన్ ట్రూడోకు తెలుసు కాబట్టే, రాజీనామా చేశారు. అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవు. నిరంతరం చుట్టుముట్టి ఉండే రష్యా, చైనా నౌకల ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చు" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కెనడా వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!


వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత
మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..


దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!


నేడు (
7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు
నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 
24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 
33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 
14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 
బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #canada #america #trump #todaynews #flashnews #latestupdate