రోజూ గుప్పెడు పిస్తాప‌ప్పును తింటే... ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా?

Header Banner

రోజూ గుప్పెడు పిస్తాప‌ప్పును తింటే... ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా?

  Fri Jan 10, 2025 21:48        Health

మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో న‌ట్స్ కూడా ఒక‌టి. న‌ట్స్‌లో అనేక ర‌కాలు ఉంటాయి. వాటిల్లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తాప‌ప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో పిస్తా ప‌ప్పు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోష‌కాహారం విష‌యానికి వ‌స్తే పిస్తా ప‌ప్పును రోజూ తినాల్సిందే అని అంటున్నారు. పిస్తాప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిల్లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల పిస్తాపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు సైతం చెబుతున్నారు.

 

కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది..
పిస్తాప‌ప్పును తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు, ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. వీటిల్లో విట‌మిన్ బి6 అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల పిస్తాప‌ప్పును తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. శ‌రీరానికి విట‌మిన్ ఇ ల‌భిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. దీంతో క‌ణాలు డ్యామేజ్ అవ‌కుండా ర‌క్షిస్తుంది. పిస్తాప‌ప్పును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌) త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. దీంతో హైబీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బ‌రువు త‌గ్గుతారు..
అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు రోజూ పిస్తాప‌ప్పును తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. పిస్తాప‌ప్పులో ప్రోటీన్లు, ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. అందువ‌ల్ల ఈ ప‌ప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. క‌నుక అధిక బ‌రువు ఉన్న‌వారు పిస్తాపప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ప‌ప్పును తింటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. పిస్తాప‌ప్పులో ఉండే ఫైబ‌ర్ షుగ‌ర్‌ను త‌గ్గించేందుకు ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. కాబట్టి డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ పిస్తాప‌ప్పు తింటే మేలు జ‌రుగుతుంది.

 

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్‌..
పిస్తాప‌ప్పులో ఉండే ఫైబ‌ర్ ప్రీబ‌యోటిక్ ఆహారంగా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల ఈ ప‌ప్పును తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. పిస్తాప‌ప్పులో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. వాపుల‌ను న‌యం చేస్తాయి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. పిస్తాప‌ప్పును తింటే కంటి ఆరోగ్యం సైతం మెరుగు ప‌డుతుంది. కంటి చూపు పెరుగుతుంది. త‌ర‌చూ పిస్తాప‌ప్పుల‌ను తిన‌డం వ‌ల్ల కంటి చూపు పెరిగి క‌ళ్ల‌ద్దాల‌ను తీసి ప‌డేస్తారు. ఇలా రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పుల‌ను తినడం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #DryFruits #Pistachios #Diet #Foods