భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించిన బంగ్లాదేశ్! సరిహద్దు వివాదంలో కొత్త మలుపు!

Header Banner

భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించిన బంగ్లాదేశ్! సరిహద్దు వివాదంలో కొత్త మలుపు!

  Mon Jan 13, 2025 21:30        Others

బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ భద్రతను పటిష్ఠం చేసింది. ఈ క్రమంలోనే కంచె నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నడుమే సరిహద్దు ఉద్రిక్తతల పేరుతో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగశాఖ ఆదివారం పిలిపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత్ సైతం తగు చర్యలు తీసుకుంది. ఇక్కడి బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇంకా చదవండిమీకు పీఎఫ్ ఖాతా ఉందా! ఫ్రీగా మీ అకౌంట్‌లోకి రూ.50 వేలు వచ్చేస్తాయి!



ఇండో- బంగ్లా సరిహద్దులో అయిదుచోట్ల కంచెల ఏర్పాటుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఢాకా ఆదివారం ఆరోపణలు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే విదేశాంగశాఖ కార్యాలయానికి వెళ్లిన వర్మ.. అక్కడున్న కార్యదర్శి జషీముద్దీన్తో సమావేశమయ్యారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్ఎఫ్, బీజీబీ (బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్)లు ఓ అవగాహనతో ఉన్నాయి. సరిహద్దు వెంబడి నేరాల నియంత్రణకు ఈ అవగాహన, సహకారం కొనసాగుతాయని ఆశిస్తున్నాన'ని తెలిపారు.


ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!

 

టాలీవుడ్ కి షాక్.. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు... ఏ2గా విక్టరీ వెంకటేశ్! ఎందుకు అంటే!

 

మరో వివాదంలో చిక్కుకున్న తిరువూరు ఎమ్మెల్యే! వివరణ కోరిన సీఎం చంద్రబాబు!

 

ఏపీ మహిళలకు ఊరట కలిగే నిర్ణయం.. రూ.లక్ష నుంచి రూ.10 లక్షలుఈనెల 18 నుంచి ప్రారంభం.. దీని వల్ల చాలా మందికి.!

 

క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

 

పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #India #banglades #boarder #todaynews #flashnews #latestupdateh #